Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ఏ నేరం జరిగినా నేరస్థులు గంజాయి సేవించే నేరాలు చేస్తున్నారు

– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఏ నేరం జరిగినా నేరస్థులు గంజాయి సేవించే నేరాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫి పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు..కృష్ణా జిల్లా పెనమలూరు లో షేక్ రఫి అనే యువకుడిని గంజాయి మత్తులో జోగుతున్న ఓ ముఠా పొడిచి చంపేసింది.

హత్య గావింపబడక ముందు రఫి నమాజుకు వెళ్తుండగా యల్లారెడ్డి, అనిల్, డాన్ బాష అనే ముగ్గురు గంజాయి మత్తులో పోట్లాడుకున్నారు. గ్యాంగ్ కు సంబంధం లేని నాగరాజ వ్యక్తి రఫిని పిలిచాడు. మీరు గొడవపడొద్దని గట్టిగా చెప్పాడు. గొడవపడొద్దని చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకున్న గంజాయి బ్యాచ్.. పెనమలూరు సెంటర్ కు వచ్చిన షేక్ రఫిని అదే రాత్రి కత్తులతో పొడిచి చంపారు.

రఫి మృతికి వారు గంజాయి సేవించి ఉండడమే ప్రధాన కారణం. యల్లారెడ్డి, అనిల్, డాన్ బాష అనే ముగ్గురిపై నాగరాజ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినప్పుడు వారిని అరెస్టు చేసివుంటే రఫి ప్రాణాలు పోయేవికాదు. ఇది పోలీసుల వైఫల్యం. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో గంజాయి వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయో ఈ సంఘటనే ఉదాహరణ.

ఈ సంఘటన వెలుగులోకి వచ్చాక టీడీపీ నాయకులు, ముస్లిం సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో తహశిల్దార్ కార్యాలయం ఎదుట మృతుడి శవాన్ని పెట్టి ధర్నా చేశాయి. ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఈ విషయం వార్తల్లో రావడంతో రఫి తల్లిదండ్రులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. ఈ సంఘటనపై సీఎం జగన్ ఇంతవరకు మాట్లాడకపోవడం చాలా అన్యాయం..

ఒక కుటుంబం బలైంది అని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాను అని సీఎం జగన్ ఒక మాట కూడా మాట్లాడలేదు. రఫి కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు. రఫి విషయంలోనే కాదు. ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి మాట్లాడడు. రఫి మృతి ప్రభుత్వ వైఫల్యంలో భాగమే. ప్రభుత్వం గంజాయిని అదుపుచేయలేకపోవడంవల్లనే ఈ సంఘటన జరిగింది. రఫి హత్య ప్రభుత్వ హత్యగానే భావించాలి.

గంజాయి రాష్ట్రంలో ప్రబలకుండా ఉక్కుపాదంతో అణచివేసివుంటే గంజాయి బ్యాచ్ రెచ్చిపోయి గొడవ చేసివుండేవారు కాదు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రోడ్డుపాలైన రఫి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. 25 లక్షలు ఇవ్వాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం.

అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రం నేడు గంజాయిని ఎగుమతి చేస్తూ గంజాయి ప్రదేశ్ గా మారిపోయింది. ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడ్డా ఏపీలోనే దాని మూలాలు దొరుకుతున్నాయి. విశాఖపట్నం, అనకాపలి, కందుకూరు గంజాయికి పేరుగాంచాయి. టీడీపీ హయాంలో గంజాయి బ్యాచ్ ని ఉక్కు పాదంతో అణచివేయడం జరిగింది.

చంద్రబాబునాయుడు గంజాయి ఉత్పత్తి జరగకుండా అదుపుచేశారు. నేడు జగన్ పట్టించుకోవడంలేదు. లిక్విడ్ గంజాయి వస్తోంది. రాష్ట్రంలో గంజాయి సిగరెట్లు కూడా సరఫరా అవుతున్నాయి. 10వ తరగతి చదివే పిల్లవాడు కూడా గంజాయి సేవిస్తున్నాడు. ఇటీవల ఇంటర్మీడియట్ చదివే పిల్లల వద్ద 3 కేజీల గంజాయి దొరికింది. మరోచోట కేజీ గంజాయిని ఇబ్రహీం పట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివరికి తిరుపతి తిరుమలలో కూడా గంజాయి యదేచ్ఛగా సరఫరా అవుతోంది.

ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గంజాయి సాగు, రవాణాలో వైసీపీ హస్తం ఉన్నట్లు ఎప్పుడో రుజువైంది. ఎప్పుడు పట్టుబడ్డా వైసీపీవారి పేర్లే బయటికి వస్తున్నాయి. ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేస్తోంది. 2021లో నారోటిక్ కంట్రోల్ బ్యూరో గంజాయి అక్రమ రవాణాలో ఏపీ మొదటి స్థానంలో ఉందని తేల్చింది.

దేశం మొత్తంలో 50 శాతం గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచే సరఫరా అవుతోంది. రేపల్లె రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మీద భర్త, పిల్లలతో కలిసి పడుకున్న ఓ వివాహిత పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ నేరాలు గంజాయి సేవించడం వల్లనే జరుగుతున్నాయని హోం మనిష్టర్ తానేటి వనిత స్వయంగా చెప్పారు. 2021లో 270 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరంతా గంజాయి సేవించడంవల్లనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డు నివేదికలో తేలింది.

టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు శ్రీసిటీ, విశాఖ పట్నంలలో పారిశ్రామిక హబ్ లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు జగన్ హయాంలో గంజాయి హబ్ లు వెలిశాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, కేరళల్లో పట్టుబడిన గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని డీఐజీలు, డీఎస్పీలు ఆరా తీయగా ఆంధ్రప్రదేశ్ నుండి అని తేలింది. రాష్ట్రంలో గంజాయిని ఇలాగే వదిలేస్తారా? లేక కంట్రోల్ చేస్తారో సీఎం చెప్పాలి.

నామమాత్రంగా చర్యలు తీసుకుంటే సరిపోదు. సమూలంగా కంట్రోల్ చేయాలి. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో గంజాయి సాగు, రవాణా విపరీతంగా పెరగింది. సీఎం ఎందుకు అరికట్టలేకపోయారు? బెంగళూరు కష్టమ్స్ అధికారులు 4.49 కిలోల ఎఫి డ్రిన్ మత్తు పదార్థపు పార్శిల్ పట్టుకుంటే అది విజయవాడలోని భారతీ నగర్ నుంచి వచ్చినట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్ ఒక్క గంజాయికే కాకుండా ఎఫిడ్రిన్, హెరాయిన్, కొకైన్, గంజాయిలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారింది. యువత మత్తులో జోగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.

వీటన్నింటిని గమనిస్తే ముఖ్యమంత్రి వీటిని ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో ఆన్ లైన్, కొరియర్ ద్వారా కూడా గంజాయి దొరుకుతోంది. ఈ గంజాయి వల్ల అనేక మంది జీవితాలు నాశనమైపోతున్నాయి. అనేక మంది అనారోగ్యంపాలౌతున్నారు. రాష్ట్రంలో ఆత్యాచారాలు, హత్యలు, దోపిడీలు ఈ గంజాయి వల్లనే జరుగుతున్నాయి. రాష్ట్రంలో యువశక్తి నిర్వీర్యమైపోతోంది. తాడేపల్లి ప్యాలెస్ కి కూత వేట దూరంలో ఒకడు గంజాయి సేవించి ఒక వికలాంగురాలి పై అత్యాచారం చేసి హత్య చేశాడు.

సీతానగరంలో పెళ్లి చేసుకోబోయే జంటను భయపెట్టి ఆ అమ్మాయిని ముగ్గురు లాక్కెళ్లి మానభంగం చేసిన సంఘటన జరిగింది. ఇంతవరకు వారిని పట్టుకున్న పాపాన పోలేదు. ఏ నేరస్థుడిని పట్టుకున్నా వారు గంజాయి సేవించి ఉంటున్నారని రూడీ అయింది. ముఖ్యమంత్రి గంజాయిపై ఓ సమీక్ష చేసి చర్యలు తీసుకుంటారా? లేక ఇలాగే వదిలేసి యువతను పాడు చేస్తారా అని మేము టీడీపీ తరపున ప్రశ్నిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫి తెలిపారు.

LEAVE A RESPONSE