Suryaa.co.in

Andhra Pradesh

2.5 లక్షల ఎకరాలకు బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్ట్ నీరందిస్తుంది.

– వంశధార ఫేజ్-2 కూడా దాదాపు పూర్తి అయ్యింది.
– ఒరిస్సా తో ఉన్న వివాదం అడ్డంకి గా ఉండటంతో.. సీఎం జగన్ స్వయంగా ఒరిస్సా ముఖ్యమంత్రితో చర్చించారు.
– బహుద, మహేంద్ర తనయ నదుల అనుసంధానం గత ప్రభుత్వంలో కమిషన్ల కోసం వాడుకున్నారు.వాళ్ళని జిల్లా ప్రజలు క్షమించకూడదు
– నీతి అయోగ్ చూపించిన మోడల్ ప్రకారం యాక్ట్ ఏపి కి తీసుకొచ్చాం
– ఇంకా చట్టం అమలు చేయలేదు.. రాష్ట్రంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది
– న్యాయవాదులు కు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.. వారిని తప్పుబట్టడంలేదు.
– సర్వే పూర్తి చేసిన తరువాతే.. చట్టం పూర్తి స్థాయిలో అమలు చేస్తాం.
– న్యాయవాదుల సలహాలను , సూచనలు అన్ని తీసుకుంటాం
– అదరాబాదరాగా అమలు చేయం.
– దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కేంద్రం ఒత్తిడి తెస్తుంది
– ఏపి తెచ్చిన చట్టం సైతం ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి.
– న్యాయవ్యాదు లతో ముఖాముఖి మాట్లాడతాం
– మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

 

వంశధార ఎస్ఈ కార్యాల‌య ప్రాంగ‌ణంలో బొడ్డేప‌ల్లి రాజ‌గోపాల‌రావు విగ్ర‌హం ఆవిష్క‌రించారు. అనంత‌రం మీడియాతో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..

ఈ ప్రాంగ‌ణాన బొడ్డేప‌ల్లి రాజ‌గోపాల‌రావు విగ్ర‌హం పెట్ట‌డం స‌బ‌బు. వంశ‌ధార ప్రాజెక్టు సాధ‌న‌లో ప్ర‌ముఖ పాత్ర పోషించిన బొడ్డేప‌ల్లి విగ్ర‌హం పెట్ట‌డం సమంజ‌సం. ఈ ప్రాజెక్టుకు రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో బొడ్డేప‌ల్లి పేరు పెట్ట‌డం జ‌రిగింది. ఈ ప్రాజెక్టు సాధ‌న‌లో చాలా మంది ఇంజినీర్లు ర‌క,ర‌కాల వ్య‌క్తులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరంతా ఈ ప్రాజెక్టు సాధ‌న‌లో అంకింతం అయి ఉన్నారు.

ఈ శుభ‌వేళ ఈ ప్రాజెక్టులో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు. ఇదే సంద‌ర్భంగా గొట్టా వ‌ద్ద బ్యారేజీ క‌డితే 19 టీఎంసీ సేక‌రించ‌డం సాధ్యం. నేర‌డి బ్యారేజీ ఎలవ్ చేయ‌లేదు. గొట్టా వ‌ద్ద స్టాగ్నేటెడ్ వాట‌ర్ ను రిజ‌ర్వాయ‌ర్ లోకి పంపాల‌ని అనుకుంటున్నాం. రిజ‌ర్వాయ‌ర్ లో ఉన్న 19 టీఎంసీని ఉప‌యోగించుకుంటాం. లెఫ్ట్,రైట్ కెనాల్ ల‌ను సంవ‌త్స‌రం పొడువునా పారే విధంగా చేయ‌నున్నాం. కృష్ణా,గోదావ‌రి బేసిన్ మాదిరిగానే వంశ‌ధార ప్రాజెక్టు వినియోగించుకుంటాం. ఆఫ్ షోర్ రిజ‌ర్వాయ‌ర్ ప‌నులు పునః ప్రారంభం అయ్యాయి. సీఎం చొర‌వ చూపి నిధులు ఇచ్చారు. తోట‌ప‌ల్లికి సంబంధించి ఆయ‌క‌ట్టు కూడా ఉంది.

టైటిలింగ్ యాక్ట్ మీద ఆందోళ‌న ఉంది. భార‌త ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఒక యాక్ట్ ను సూచించింది. టైటిల్ పెర్ఫ‌క్ట్ గాఉండాల‌ని త‌లంపుతో ఇర‌వై సంవ‌త్స‌రాల అధ్య‌య‌నం త‌రువాత నీతి అయోగ్ సూచించిన మోడ‌ల్ యాక్ట్ ఇది. ఈ చ‌ట్టం అమ‌లు చేయ‌లేదు. దేశమంతా ఈ చ‌ట్టం అమలు చేయాలి అని కేంద్రం అనుకుంటోంది. ఇందులో న్యాయ‌వాదుల‌కు కొన్ని అభ్యంత‌రాలు ఉన్నాయి. ఈ చ‌ట్టం అమ‌లు కావాలంటే స‌ర్వే పూర్తిగా జ‌ర‌గాలి.

ప‌దిహేడు వేల రెవెన్యూ విలేజ్ ల‌కు గాను నాలుగు వేల విలేజ్ ల‌లో స‌ర్వే ప‌నులు పూర్త‌య్యాయి. స‌ర్వే నంబ‌ర్ ప్రకారం మ్యాప్స్ తో స‌హా గుర్తించిన త‌రువాత ఈ చ‌ట్టం అమ‌లు చేయడం సాధ్యం అవుతుంది. న్యాయ‌వాదుల అభ్యంత‌రాలు పునఃప‌రిశీలించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. అలానే వెబ్ సైట్ ఒక‌టి ఏర్పాటు చేయ‌నున్నాం. ఇందులో కొంత మంది హైకోర్టుకు వెళ్లారు. కోర్టు డైరెక్ష‌న్ ను ప‌రిశీలించి అమ‌లు చేస్తుంది.

చ‌ట్టం అన్న‌ది దేశ వ్యాప్తం ప్ర‌యోజ‌నాల కోసం చేస్తుంది. మ‌నం చేసిన చ‌ట్టం ఇంకో ఎనిమిది,తొమ్మిది రాష్ట్రాలు అమ‌లు చేసేందుకు ప‌రిశీలిస్తున్నాయి. టైటిల్ క్లియ‌ర్ గా ఉంటే ఇన్వెస్టిమెంట్స్ వస్తాయి. స‌రైన టైటిల్ లేక‌పోతే ధ‌న‌వంతుల చేతిలోకి బీద‌ల ఆస్తులు వెళ్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమ‌లుపై న్యాయవాదుల అభిప్రాయాల‌ను గౌర‌విస్తున్నాం. మీ స‌ల‌హాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాం.

చ‌ట్టం అన్న‌ది వ్య‌వ‌స్థకు సంబంధించింది. వ్య‌క్తులు శాశ్వ‌తం కాదు. వ్య‌వ‌స్థ అన్న‌దే శాశ్వ‌తం. ల్యాండ్ స‌ర్వే యాక్ట్ అమ‌లు విష‌య‌మై 1991లో దీనిపై అధ్య‌య‌నం ఆరంభం అయింది. ఈ చ‌ట్టం అమ‌లు కు సంబంధించి మీరెవ్వ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. మీరు విధులు నిర్వ‌హించాల‌ని స‌జావుగా కోర్టులు సాగాల‌ని కోరుతున్నాం.

రాష్ట్ర వ్యాప్తంగా 71వేల ఎక‌రాలు సేక‌రించి 31ల‌క్ష‌ల‌కు పైగా పేద‌ల‌కు ఇంటి ప‌ట్టాలు ఇచ్చాం. అలానే 12 ల‌క్ష‌ల మందికి పైగా పేద‌ల‌కు ఇళ్లు ఇచ్చాం. ప‌ట్టాలు పొందిన వారంద‌రికీ రిజిస్ట్రేష‌న్ చేయించేందుకు ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ప్ర‌భుత్వం ఇచ్చిన మీ ప‌ట్టాను,ఆధార్ కార్డును తీసుకుని రెవెన్యూ సెక్ర‌ట‌రీని,ఇంకా ఇత‌ర రెవెన్యూ అధికారుల‌ను క‌లిసి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ ఛార్జిల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. ఇందులో ఎటువంటి అపోహల‌కూ తావు లేదు. ఇది పూర్తిగా ఉచితంగా ప్ర‌భుత్వ‌మే అందిస్తున్న సౌక‌ర్యం. దీనిని పౌరులంతా అర్హ‌త పొందిన పౌరులంతా వినియోగించుకోవాల‌ని కోరుతున్నాను.

మీ స‌మీప పంచాయ‌తీ సెక్ర‌టేరియ‌ట్ కు మీరు వెళ్తే మీ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. అక్క‌డికి వెళ్తే మీ పేరిట మీకు హ‌క్కులు రాష్ట్ర వ్యాప్తంగా 31లక్ష‌ల 65 వేల మందికి చేయాలి. మ‌న జిల్లాలో ఇంకా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ముందుకు సాగ‌డం లేదు. పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ,రెవెన్యూ సెక్ర‌ట‌రీల‌ను క‌లిసి మీ ఆధార్ కార్డుతో వెళ్తే ఎటువంటి ఛార్జ్ లు చెల్లించ‌కుండానే మీ సైట్ ను రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌చ్చ. న‌యా పైసా తీసుకోవ‌డం లేదు.

ఎమ్మార్వో హత్య కేసులో విశాఖ పోలీస్ కమీషనర్ కి డైరెక్షన్ ఇచ్చా. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దోషులను ప్రభుత్వం కఠినంగా వ్యవరిస్తాం. ఎంతటి వారు ఎమ్మార్వో హత్య వెనుక ఉన్నా విడిచిపెట్టం . అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

 

LEAVE A RESPONSE