విఠంరాజుపల్లి వైసీపీ నుంచి 28 కుటుంబాలు తెలుగుదేశంలో చేరిక

విఠంరాజుపల్లి వైసీపీ నుంచి 28 కుటుంబాలు తెలుగుదేశంలో చేరిక

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు క్యాంపు కార్యాలయం ఈ చేరికలతో జాతరను తలపిస్తోంది. తాజాగా ఇవాళ విఠంరాజుపల్లికి చెందిన 28 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాయి.

ఈరోజు పార్టీలో జాయిన్ అయిన వారు రొడ్డ జంగం రెడ్డి, కొత్తపల్లి అయ్యప్ప రెడ్డి, పగడాల చిన్న కోటిరెడ్డి, కందులు లక్ష్మారెడ్డి ,భవనం వెంకటేశ్వర రెడ్డి, పగడాల వెంకటేశ్వర్ రెడ్డి తన్నీరు, పెద్ద యోగయ్య, లక్కు గంగిరెడ్డి, కొమ్మతోటి ఎలమందరావు, దాసరి చిన్న వెంకయ్య, ధార అంకారావు, కొమ్మతోటి అప్పారావు, కొమ్ముతోటి బిక్షాలు, నరసింహారావు, భవనం లక్ష్మారెడ్డి ,పెరుమాళ్ళ పెద్ద వీరయ్య, కోలేటి శోభన్ బాబు, కొమ్మతోటి శేషగిరి, పెనుమాల మాణిక్యరావు, ఓపూరి చిన్ని, పెనుమల భాస్కరరావు, పాలేటి సుందర్రావు, వీర్ల శ్రీనివాసరావు, బేతం కృష్ణారావు, కొమ్మతోటి మరియదాసు, వల్లపు కోటేశ్వరరావు, విఠంరాజుపల్లి సమీపంలో ఉన్న జీవీ క్యాంపు కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగింది.

తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తున్న నేతలకు జీవీ ఆంజనేయులు సతీమణి లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ…”పార్టీలో చేరిన అందరికి కృతజ్ఞతలు. ఈ చేరికలు చూస్తుంటే భారీ మెజార్టీ వస్తుందని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ పథకాలకు ఆకర్షితులైన జనాలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలో చేరుతున్నారు. ఈ విప్లవం ఒక్క వినుకొండకే పరిమితం కాలేదు. రాష్ట్రమంతా కొనసాగుతోంది. వైసీపీ పాలనతో విసిగిపోయిన బాధితులతో ఇప్పుడు స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. ఇంకా వస్తూనే ఉంటారు. వారందరికీ మా పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి” అని లీలావతి అభిప్రాయపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ… జీవీ ఆంజనేయులు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మీద నమ్మకంతో తెలుగుదేశంలో పార్టీలో చేరిన అందరికి స్వాగతం. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తాం. సూపర్ సిక్స్‌ పథకాలతో ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. ప్రతి గ్రామం, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తాయి.” అని మక్కెన అభిప్రాయపడ్డారు.ఇంకా ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాదినేని ఆంజనేయులు, సీనియర్ నాయకులు వజ్రాల కృష్ణారెడ్డి, ముత్తినేని ఏడుకొండలు, కర్నాటి వెంకట రెడ్డి, ఎర్రం రెడ్డి అంజిరెడ్డి, చింత ఆదిరెడ్డి, నాగిరెడ్డి వెంకటరెడ్డి,మాదాల కృష్ణ, బోడెప్పుడు గోవిందరాజులు మేడం అశోకు, మాదాల చిరంజీవి రాధోనివతుల ప్రభుదాసు,పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Leave a Reply