జనసేనలో చేరిన మండలి, నిమ్మక

పిఠాపురం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. వారికి పవన్‌కల్యాణ్ పార్టీకండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండలి మాట్లాడుతూ, తనను అవనిగడ్డ నుంచి పోటీ చేయమని పవన్ కోరారని, చంద్రబాబు కూడా మద్దతు తెలిపారన్నారు.

తనకు-పవన్‌కు చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉందని, తెలుగుభాషాభివృద్ధికి తాను చేస్తున్న కృషిని పవన్ అభినందించారన్నారు. పవన్ ఓట్ల రాజకీయం చేయడం లేదని, సమాజంపై ఉన్న బాధ్యతతో రాజకీయాలు చేస్తున్నారని కొనియాడారు. నిమ్మక మాట్లాడుతూ.. పాలకొండలో ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్ కలసి దోచుకుంటున్నారని, వారిని కూటమితో కలసి తరిమికొడతానన్నారు. తనకు అవకాశం ఇచ్చిన పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply