వార్ధా నదిలో నలుగురు యువకులు గల్లంతు

కొమురం భీమ్ : హోలి పండగ పూట కుమురం భీం జిలాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు వార్దా నదిలోకి దిగిన నలుగురు యువకులు గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపింది. కౌటాల మండలం తాటిపల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను నదిమాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వారిని సంతోష్ (25), ప్రవీణ్(23), కమలాకర్(22), సాయి(22) గుర్తించారు.

Leave a Reply