Suryaa.co.in

Telangana

మంత్రి దామోదర దన్నుతో 40 వేల కోట్ల భూదందా

– తెల్లాపూర్ తో పాటు అమీన్పూర్, పటంచేరు మున్సిపాలిటీల్లో పర్మిషన్ పొందాలంటే మంత్రిగారిని దర్శనం చేసుకోవాలట
– కబ్జాలకు పాల్పడుతున్న మంత్రులను భర్తరఫ్ చేయాలి
– రాష్ట్రంలో అతిపెద్ద భూ కబ్జా
– బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లోని సర్వే నెంబర్ 30 సంబంధిత 720 ఎకరాల భూమిపై జరుగుతున్న అక్రమాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు.

500 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉంటుందని తేలినప్పటికీ, అక్రమ పట్టాలతో ప్రైవేట్ వ్యక్తుల పేరిట మంత్రి దామోదర రాజనర్సింహ అతని అనుచరులు, భూ రిజిస్ట్రేషన్లు జరువుతున్నారు. దీనికి దామోదర రాజనర్సింహ అనుచరులు ఏజెంట్లు గా వ్యవహరిస్తున్నారు.

10 ఎకరాల పట్టా భూమిని సాకుగా చూపించి, 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. షెడ్లు నిర్మించి రోడ్లు కూడా వేస్తున్నారు. సర్వే నెంబర్ 30 పై వివాదం కోర్ట్ లో పెండింగ్ లో ఉన్నప్పటికీ, అదే సర్వే నెంబర్ లో బై నెంబర్ లు ఎలా సృష్టించారు? దాన్ని బహిర్గతం చేయాలి. నిషేద జాబితాలో ఉన్న భూములు ఎలా రిజిస్ట్రేషన్ అవుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

రద్దు చేసిన యాజమాన్య పత్రాలను చూపించి, దామోదర అనుచరులతో ఈ కబ్జాలకు స్కెచ్ వేశారు. అక్కడ ఎవరెవరు తిరిగారో ఏయే కార్లు ఆ ప్రాంతానికి వచ్చాయో మాదగ్గర వివరాలు ఉన్నాయి. 2001 నుండి హైకోర్టులో నడుస్తున్న కేసులపై కోర్టు స్టే ఉన్నప్పటికీ, అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతుండడం చూస్తుంటే పెద్దల అండతోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్టు కనిపిస్తోంది.

ఏ ప్రాంతంలో అయినా కోర్ట్ లో పెండింగ్ లో ఉంటే, రిజిస్ట్రేషన్ లు ఆపుతారు. కానీ ఇక్కడ యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి. వాటిని ఎందుకు ఆపడం లేదు? ప్రజలు తెల్లాపూర్ తో పాటు అమీన్పూర్, పటంచేరు మున్సిపాలిటీల్లో పర్మిషన్ పొందాలంటే మంత్రిగారిని దర్శనం చేసుకోవాలట.

కె సిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుద్దు ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్ వచ్చాకా ప్రైవేట్ వ్యక్తులు గద్దల్లా వాలి పోయారు. మళ్ళీ గెలమనే తెలిసి అందినకాడికి దోచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగమే ఈ కబ్జా.

భూకబ్జాదారుల చేతుల్లో నుండి ప్రభుత్వ భూమిని రక్షించి, భూమిలేని నిరుపేదలు, దళితులకు 150 గజాల లేదా 200 గజాల ప్లాట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. BRS పార్టీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది అక్రమార్కులను BRS పార్టీ విడిచిపెట్టదని హెచ్చరిస్తున్నాను

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, భూమి కేటాయింపులు పారదర్శకంగా చేపట్టాలి. ఈ కబ్జా పై ముఖ్యమంత్రి, పి సి సి అధ్యక్షుడు స్పందించాలి. జిల్లాలను , ప్రభుత్వ శాఖలను పంచుకుని అవినీతికి వసూళ్లకు , కబ్జాలకు పాల్పడుతున్న మంత్రులను భర్తరఫ్ చేయాలి..

కోర్టు స్టే ఉన్నప్పటికీ, ఎందుకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? ప్రైవేట్ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? కబ్జాకు సూత్రధారులు దామోదర రాజనర్సింహ గారు మరియు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దీనిపై న్యాయ విచారణ జరిపించాలి.

LEAVE A RESPONSE