(20.04.67)
చెప్పాలని ఉంది..
కథ చెప్పాలని ఉంది..
పల్లెటూరి అబ్బాయికి పదును పెట్టి వెన్ను తట్టి
మట్టిని మణిగా తీర్చిన మనసెరిగిన దేవత కథ చెప్పాలని ఉంది..
నిజానికి అది దేవత
కథ కాదు..
ఉమ్మడికుటుంబం వ్యధ…
ఆ కుటుంబం కోసం
హీరో పడిన బాధ..
అన్నను మార్చాలని..
వదిన కాపురం సరిదిద్దాలని
తాపత్రయపడిన
కుర్రాడి తపన..
పెద్ద కుటుంబాలు
రానున్నరోజుల్లో ఎన్ని ఇక్కట్లకు గురి కానున్నాయో
ఊహించి ఎలా కాపాడుకోవాలో చూపిన
ఓ సందేశం..
అలా జరక్కూడదన్న
ఎన్టీఆర్ ఆవేశం..!
కామెడీగా తీసినా అద్భుతమైన
రెండు నాటకాలు..
చెప్పిన వినవు
చెముడా గిముడా
అంటూ యముడే చేసిన
గందరగోళం..
వాణిశ్రీ సతీసావిత్రి మేళం
చచ్చిన రాజబాబు దోమలను చంపుకుంటూ
వేసిన తాళం..
ఇట్టి కోరికలు ఎన్ని తీర్చినను
మా యమధర్మమునకు
ఎటువంటి భంగము వాటిల్లదు కదా..
అబల..ఆఖరి కోరికని వాపోవుచున్నది..
ఇచ్చి…లాలించి..బుజ్జగించి
మరలించెద…
సమవర్తి నిరతి..
ఇంకెక్కడికి పోయెదవు..
విరిగిన సావిత్రి మూతి..
ఏం..యముడి హూంకారం…
తిలకం గొంతు ఘీంకారం..
మరో నాటకంలో
పూటుగా తాగి సెట్టునే తగలబెట్టిన బక్క మారుతి
రాజబాబు విన్యాసం..
పండిన హాస్యరసం…!
పిదప సినిమా సీరియస్..
ఇంట్లో చిన్నవాడైన
అన్న నందమూరే హీరో
ఆయనే నిర్మాత..
ఆయనే అన్నీ..
ఒంటిచేత్తో సినిమా నడపడం
ఆయనకు ఎడం చేతి పని..
అందుకే ఆయనయ్యాడు
సినిమా ముని..
లాల్చీ పైజమాతో
ఆయన వెంటే ఆమని..!
పౌరాణికంలా పద్యాల సమాహారం..
ఫక్తు మాసు గీతాలు..
కోరనిదే వరలిచ్చి..
కొండంత వెలుగునిచ్చే
కృష్ణకుమారి సోయగం..
ప్రపంచంలోని బాధలన్నీ మోస్తూ యధావిధిగా
అభినేత్రి సావిత్రి..
సూర్యకాంతం షరామామూలే…
దిగ్గజాల నటవర్గం..
ఎన్టీఆర్ చేతిలో పగ్గం..
కుటుంబ విలువలు గౌరవించే
నాటి రోజులు..
ఇలాంటి పేరున్న సినిమా
ఆడదా వందరోజులు..!
ఇ.సురేష్ కుమార్
9948546286