సొల్లు వాగుడు వాగకుండా పనిచేసి చూపించాలి

-ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు హామీల అమలు చేతకాక అయోమయంలో పడుతున్నారు
-అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు
-గతంలో ఏ అప్లికేషన్లు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశాం
-దళారీ వ్యవస్థ లేకుండా ఆన్లైన్ సిస్టం పెట్టాం
-6 గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయి
-కౌలు రైతులను పాస్ పుస్తకం నంబర్లు అడుగుతున్నారు
-ఉద్యమకారులను కేసుల వివరాలు అడుగుతున్నారు
-వారి హయాంలో Fir వివరాలు లేకుండా ,రికార్డులు లేకుండా చేసి ఇవాళ వివరాలు అడుగుతున్నారు
-పరిపాలన చేయమని అధికారమిస్తే శ్వేత పత్రాలంటూ తప్పించుకుంటున్నారు
-ఒక్క పత్రానికే ఆగమై వాళ్ళది వాళ్ళకే అర్థంకాక తోకముడిచారు
-హామీల అమలు చేయకపోతే ప్రజలు వెంటపడి తరముతారు
దమ్ముంటే నల్లగొండ జిల్లాకు మేం చేసిన దాంట్లో పది శాతం చేయాలని సవాల్
-తమ హయాంలో సాగులోకి తెచ్చిన భూమిని కొనసాగిస్తే చాలు
-ఇప్పుడు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పూర్తి చేయాలి
-కాంగ్రెస్ ప్రజాపాలన , జిల్లా మంత్రులు కోమటిరెడ్డి , ఉత్తమ్ ఆరోపణలపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుంది అనీ, అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి , సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయి లో విమర్శించారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన జగదీష్ రెడ్డి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి , ఉత్తమ్ ఆరోపణల పై విరుచుకుపడ్డారు.గతంలో ఏ అప్లికేషన్లు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసాం అన్నారు.

తమ హయాంలో దళారి వ్యవస్థ లేకుండా ఆన్లైన్ సిస్టం పెట్టాం అన్నారు . 6 గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని,కౌలు రైతులను పాస్ పుస్తకం నంబర్లు అడుగుతున్నారని, ఉద్యమకారులను కేసుల వివరాలు అడుగుతున్నారని మండి పడ్డారు.వారి హయాంలో Fir వివరాలు లేకుండా ,రికార్డులు లేకుండా చేసి ఇవాళ వివరాలు అడుగడం హాస్యాస్పదం అన్నారు.పరిపాలన చేయమని అధికారమిస్తే శ్వేత పత్రాలంటూ తప్పించుకుంటున్నారు అని అన్నారు.ఒక్క పత్రానికే ఆగమై వాళ్ళది వాళ్ళకే అర్థంకాక తోకముడిచారని అన్నారు.

అసెంబ్లీలో సోయి లేకుండా మాట్లాడి పలచనైయ్యారని ఎద్దేవా చేశారు.ప్రజలు మిమ్మల్ని పథకాలు అడుగుతున్నారు పత్రాలు కాదన్నారు.పత్రాల డ్రామాలు ఎక్కువకాలం సాగవన్న జగదీష్ రెడ్డి,తెలంగాణ ప్రజలు మీ మోసాలను ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారన్నారు. హామీల అమలు చేయకపోతే ప్రజలేవెంటపడి తరముతారన్నారు.దమ్ముంటే నల్లగొండ జిల్లాకు మేం చేసిన దాంట్లో పది శాతం చేయాలని సవాల్ విసిరారు.తమ హయాంలో సాగులోకి తెచ్చిన భూమిని కొనసాగిస్తే చాలని అన్నారు.మీ హయాంలోనే ఎసెల్బిసి కి దొంగ టెక్నాలజీ తెచ్చారు అన్నారు.
ఎస్సేల్బిసి ప్రాజెక్టు ను ఇప్పుడు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు.సొల్లు వాగుడు వాగకుండా పనిచేసి చూపించాలి అని కోరారు.

60 ఏళ్ళ మీ నిర్వాకం లో జరిగిన అనర్ధాలను 10 ఏళ్ళలో సరిదిద్దాం అన్నారు. 9 న రుణ మాఫీ , 4 న రైతు బంధు అని కోతలు కోసిన కాంగ్రెస్ నేతలు అమలు ఎక్కడజరిగిందో చెప్పాలి అని కోరారు.పత్రాల పేరుతో తప్పించుకుని బిఆర్ఎస్ పై తప్పుని ఎంచే పని చేస్తున్నారని అన్నారు. డ్రామాలతో ఎక్కువ రోజులు పరిపాలన చేయలేరన్నారు. ఖజానాలో లంకె బిందెలు ఉన్నాయని వచ్చారన్న జగదీష్ రెడ్డి,గతంలో లంకె బిందెల కోసం గుళ్ళు తొవ్విన బాపతే వీళ్ళంతా అంటూ చలోక్తులు విసిరారు.

ఖజానాకు డబ్బు జమ చేసే జ్ఞానంలేని వాళ్ళు పరిపాలనకు వచ్చారని అన్నారు.ఇంకా చూడాల్సింది చాలా ఉంది అప్పుడే ఎం మొదలైంది అన్నారు.

హామీలు అమలు చేయకపోతే ప్రజలే మీ పై పత్రాలు విడుదల చేసే రోజు రాకముందే జాగ్రత్తగా పనిచేయాలి అన్నారు. ప్రజలను ఓక్కసారి మోసం చేయగలిగారు, ఉత్త కోతలు మానేసి మంచి పరిపాలన చేయండి అనీ సూచించారు. అప్పులు లేకుండా అన్ని చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు,అలా చేస్తే మీ నాయకత్వాన్ని అంగీకరిస్తాం అన్నారు.

Leave a Reply