70 లక్షల ఫోన్ నెంబర్లు నిలిపివేత

– డిజిటల్ పేమెంట్ల మోసాలకు కేంద్రం అడ్డుకట్ట

దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్‌ నంబర్లలో 70 లక్షల నంబర్లను నిలిపివేసినట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం వెల్లడించింది.డిజిటల్‌ పేమెంట్లలో మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. డిజిటల్‌ లావాదేవీలు భారీగా కొనసాగుతున్న తరుణంలో డిజిటల్‌ మోసాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటిని అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే అనుమానాస్పద లావాదేవీల కారణంగా వీటిని నిలిపివేసినట్టు తెలిపింది.

Leave a Reply