-శంషాబాద్ వద్ద మంగ్లీ కారును డీకొట్టిన డిసియం వ్యాన్
-చేగురు కహ్నా శాంతివనంకు వెళ్ళి తిరిగి వస్తున్న సింగర్ మంగ్లీ
గాయని మంగ్లీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తొండుపల్లి వద్దకు రాగానే వెనకాల నుండి వస్తున్న డిసియం వ్యాన్ కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీ కారు వెనుక భాగం స్వల్ప డ్యామేజ్ అయింది. ప్రమాద సమయంలో కారులో మగ్లితోపాటు డ్రైవర్ రాజు, మనోహర్ ఉన్నారు.రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక దినోత్సవానికి మంగ్లీ హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అదే కారులో మంగ్లీ ఇంటికి వెళ్లిపోయారు.
మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో మంగ్లీ కారు వెనుక భాగం బాగా దెబ్బతింది.