Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల ముందే జగన్ కి బ్రాహ్మణులు గుర్తొస్తారా ?

పూజారులు, అర్చకులపై దాడులు జరిగినపుడు ఎందుకు స్పందించలేదు?
గత ఎన్నికల్లో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నేరవేర్చారా?
-టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్

సీఎం జగన్ బ్రాహ్మణులను 5 ఏళ్ల నుంచి అన్ని విధాల అణిచివేస్తూ ఎన్నికల ముందు బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించటం సిగ్గుచేటని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ మండిపడ్డారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ 5 ఏళ్ల నుంచి బ్రాహ్మణులకు అణగ ద్రొక్కుతున్నారు. ఎన్నికల ముందే జగన్ కి బ్రాహ్మణులు గుర్తొస్తారా ? దేవాలయాలపై, పూజారులు, అర్చకులపై దాడులు జరిగినపుడు సీఎం ఎందుకు స్పందించలేదు?

రామతీర్దంలో రాముడి విగ్రహ ద్వసం, అంతర్వేదిలో రధం తగులబడటం, విజయవాడ దుర్గ గుడిలో వెండి సింహాల మాయం ఘటనలపై విచారణ జరిపారా? ఆ ఘటనల్లో ఎంతమంది దోషుల్ని శిక్షించారు? కాకినాడలో వైసీపీ నేత అర్చకునిపై దేవాలయంలోనే బూతులు తిట్టి దాడి చేశారు. ఈ ఘటన జరిగినపుడు ఈవో, డీఎస్పీ వచ్చి దానికి రాజీచేసే ప్రయత్నం చేశారు తప్ప, నిందితులపై చర్యలు తీసుకోలేదు. మరో 40 రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఇదే ఈవో, డీఎస్పీ చేత కాకినాడ ఘటనపై విచారణ చేసి దోషుల్ని శిక్షిస్తాం.

5 ఏళ్లలో బ్రాహ్మణ కార్పోరేషన్ కి రూ. 1000 కోట్లు ఖర్చు చేశామని సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ కార్పోరేషన్ ద్వారా ఒక్కరికైనా రుణాలిచ్చారా? సాధారణ సంక్షేమ పధకాలకు అర్హులు కాని వారి కోసం నాడు చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదే. ఈ కార్పోరేషన్ ద్వారా బ్రాహ్మణులకు 11 పధకాలు అమలు చేశారు. 1 -5 వ తరగతి విద్యార్దులకు రూ. 5 వేలు, 6,7 తరగతి విద్యార్దులకు రూ. 7500 , 8-12 వ తరగతి విద్యార్దులకు రూ. 10 వేలు, డిగ్రీ విద్యార్దులకు రూ. 15 వేలు, బీటెక్ విద్యార్దులకు రూ. 20 వేలు, పీజీ విధ్యార్దులకు రూ. 25 వేలు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా?

వైసీపీ పాలనలో ఎంతమందికి కార్పోరేషన్ ద్వారా మేలు చేశారు? అందరికీ ఇచ్చిన నవరత్నాలే ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా బ్రాహ్మణులకు జగన్ చేసిందేంటి? టీడీపీ హయాంలో బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా రూ. 235 కోట్లు ఖర్చు చేసి 1 లక్షా 63 వేల బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ది చేకూర్చారు. నాడు విదేశీ విద్యకు 5 వేల మందిని పంపిస్తే నేడు కేవలం 300 లోపు విద్యార్దులను మాత్రమే విదేశీ విద్యకు పంపారు.

నాడు క్రిడిట్ సొసైటి రూ. 50 కోట్లతో ప్రారంభించాం. నేడు అది 80 వేల మంది మెంబర్ షిప్ కి పెరిగింది. 9 జిల్లాలో క్రెడిట్ సోసైటి బ్యాంకులు ఏర్పాటు చేశాం. దీనికి రూ. 100 కోట్లు డిఫాజిట్లు ఉన్నాయి. రూ. 100 కోట్లు అప్పులు ఇవ్వటం జరిగింది. బ్రాహ్మణులకు అన్ని విధాల మేలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలనలో బ్రాహ్మణుల ఆస్తులన్నీ అన్యాక్రాంతం చేశారు. గత ఎన్నికల్లో బ్రాహ్మణులకు ఇచ్చిన ఒక్క హామీనైనా జగన్ అమలు చేశారా?

6 సి దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి 2019 జీవో సూచించిన దానికంటే అదనంగా జీతాలు ఇస్తామన్న హామీ ఏమైంది? దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా? దేవాలయాల్లో దూపదీప నైవేద్యం, ఇతర అర్చకుల జీతాల కోసం పంచాయితి జనాభా బట్టి రూ. 25 వేల నుంచి రూ. 30 వేలిస్తామన్నారు ఏమైంది? జగన్ మాయలో బ్రాహ్మణలు పడొద్దని, బ్రాహ్మణ సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులంతా చంద్రబాబును గెలిపించాలని బుచ్చిరాం ప్రసాద్ కోరారు

LEAVE A RESPONSE