– సీఎంతో కలసి బండి ఏం చేస్తున్నారో మాకు తెలుసు
– ఆయనకు శవాలు, శివాలు తప్ప తెలిసింది ఏమీ లేదు
– బండి బండారం త్వరలో విప్పుతా
– రేవంత్‌ను సంజయ్ ఎందుకు విమర్శించరు?
– బండికి సీఎం అంటే భయమెందుకు?
– ప్రజలే తమ ఆస్థులను, ప్రాణాలను కాపాడుకోవాలి
– శాంతిభద్రతల అంశంలో కాంగెస్ ప్రభుత్వం విఫలం
– సొంతంగా సెక్యూరిటీని పెట్టు కోవాలి
– గస్తీ బృందాలుగా ఏర్పడ కాపాడుకోవాలి
– కరీంనగర్ దోపీడి దొంగలను పట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం
– రేవంత్ రెడ్డి గతంలో చర్లపల్లి జైలులో ఉన్నప్పుడు అక్కడ తనకు కలిసిన దొంగలకి బ్యాచ్మేట్లకి ఏమైనా ప్రత్యేకంగా స్వతంత్రం ఇచ్చి ఈ దారి దోపిడీలకు చేపిస్తున్నాడన్న అనుమానం
– భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి శాంతిభద్రతలను కాపాడే శక్తి పూర్తిగా కోల్పోయిందని…. ప్రజలే తమ రక్షణకు బాధ్యత చేతుల్లోకి తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడి వారక్కడ ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి తర్వాత ఇబ్బంది పడడం కంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలని గ్రామాల్లోని పట్టణాల్లోని యువత ప్రజలు గస్తీ గస్తీ పెట్టుకోవాలని అంతటి దారుణమైన పరిస్థితి దాపురించిందని కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే హోం శాఖ మంత్రిగా కూడా ఉన్నారని అయితే పట్టపగలు ఉదయమే తుపాకులు చేతపట్టి కాల్పులు జరిపి మరి దోపిడీలకు తెగబడుతుంటే రేవంత్ రెడ్డి కళ్లు మూసుకొని కూర్చున్నారన్నారు.
రేవంత్ రెడ్డి గతంలో చెర్లపల్లి జైలులో ఉన్నప్పుడు అక్కడ తనకు కలిసిన దొంగలకి బ్యాచ్మేట్లకి ఏమైనా ప్రత్యేకంగా స్వతంత్రం ఇచ్చి ఈ దారి దోపిడీలకు చేపిస్తున్నాడన్న అనుమానం వస్తుందని కేటీఆర్ అన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దాచుకో దోచుకో స్కీంలో భాగంగా ఇలాంటి దారి దోపిడీ దొంగలను మంత్రులు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో పాటు కలుపుకున్నారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
కరీంనగర్ లాంటి పట్టణం నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పట్టపగలు తుపాకులు చేతపట్టి దోపిడీ చేసే స్థాయిలో పరిస్థితులు దిగజారాయంటే ప్రజలు ఎలా బతకాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలు మేల్కొని జాగ్రుకులై ఉండాలన్నారు.
మొన్ననే భారీగా డబ్బులు కుమ్మరించి మున్సిపల్ ఎన్నికల్లో నామమాత్రపు మెజారిటీతో బయటపడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారన్నారు. ఆయనకు శవాలు, శివాలు తప్ప తెలిసింది ఏమీ లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి కానీ, ఇప్పటిదాకా రేవంత్ రెడ్డిని ఒక్క మాట కూడా అనలేదని, ఎందుకు రేవంత్ రెడ్డికి బండి సంజయ్ అంతగా భయపడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డితో చేస్తున్న పైరవీల భూముల విషయంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందని బండి సంజయ్ అనుకుంటున్నారా అన్నారు. రేవంత్ రెడ్డితో కలిసి బండి సంజయ్ చేస్తున్న కార్యక్రమాలు అన్నిటిపైన సమాచారం, ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఎవరికి సహాయంగా ఉంటున్నారో అన్నీ బయటకి తీస్తామన్నారు.
కానీ గత ప్రభుత్వం చేసిన మంచి పనులన్నింటినీ పక్కనపెట్టి పనికిరాకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరికి శాంతిభద్రతల అంశంలో కూడా పోలీస్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పోలీసులను శాంతిభద్రతల సమస్య పైన దృష్టి సారించకుండా కేవలం రాజకీయ వేధింపులకే పోలీస్ యంత్రాంగాన్ని వాడుతున్నారని అందుకే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా రోజురోజుకి దిగజారిపోతున్నాయన్నారు. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లను పట్టుకోవడం, ధర్నాలు రాస్తారోకోలు చేయకుండా అడ్డుకోవడం, తన సొంత వ్యాపారాల కోసం అడ్డగోలుగా బెదిరింపులకు కొంతమంది అధికారులను వాడుకోవడం వంటి కార్యక్రమాలకే బిజీగా ఉంచడం వల్ల శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని కేటీఆర్ అన్నారు. ఒక ప్రైవేట్ ఆర్మీ మాదిరిగా కేవలం రాజకీయాలకు పోలీస్ వ్యవస్థను వాడుకోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఇంత దారుణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నా ప్రజల్లో మనోధైర్యం నింపడానికి ఎలాంటి కార్యక్రమాలు గాని కనీసం చివరికి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన గాని చేసిన పాపాన ముఖ్యమంత్రి పోలేదన్నారు.
నిన్న కరీంనగరలో జరిగిన దోపీడీ ఘటణ భాదితులకు భరోసా కల్పింంచేందుకు వెంకటాద్రి, రేనే ఆస్పత్రిలో, అపోలో లొ చికిత్స పొందుతున్న పి యం జె బాధితులను స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలార్ తో కలసి పరామర్శిన బి అర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి అర్, తర్వతా పి యం జె జ్యువలర్స్ ను పరిశీలించారు.
రాష్ట్రంలో ఒకప్పటి బీహార్ మాదిరి పరిస్థితులు దాపురిస్తున్నాయన్నారు. ఈరోజు నిన్న దుండగుల దాడిలో గాయపడిన కుటుంబ సభ్యులను వ్యక్తులను కలిసినప్పుడు వారు తీవ్రమైన భయాందోళనలో ఉన్నారన్నారు. ఈరోజు మాకు జరిగింది రేపు మిగిలిన వాళ్లకు జరగదు అనే గ్యారెంటీ ఏమిటి అని వారు ప్రశ్నించిన విషయాన్ని కేటీఆర్ తెలియజేశారు.
ఇంత జరిగి ఒకటిన్నర రోజులు గడుస్తున్న రెండు రోజులు అయినా కనీసం ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు అన్నారు. మాస్కులు పెట్టుకోకుండా తుపాకులు చేతుల పట్టుకొని దోపిడీలకు గురిచేసిన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు.
ఒకప్పుడు కేసీఆర్ సిసి కెమెరాలను పెట్టి పర్యవేక్షణ చేయిస్తుంటే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అవే సిసి కెమెరాలను హ్యాకర్లతోని హ్యాక్ చేయించి రాజకీయ నాయకుల పైన ప్రతిపక్షాల పైన నిఘా కోసం వాడుతున్నాయన్నారు.
గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలకు అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చామని కేటీఆర్ అన్నారు. అందులో భాగంగానే పోలీస్ శాఖకు అధునాతన వాహనాలతో పాటు అనేక సౌకర్యాలు కల్పించి అద్భుతమైన తీరుగా లా అండ్ ఆర్డర్‌ని శాంతిభద్రతలను కట్టుదిట్టం చేశామని తెలిపారు.
సిసి కెమెరాలను ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేయడంతో పాటు కమ్యూనిటీ భాగస్వామ్యంతో అనేక సిసి కెమెరాలను ఏర్పాటు చేయించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కరీంనగర్ పట్టణాన్ని ఒక సేఫ్ (Safe) అండ్ సెక్యూర్డ్ సిటీగా (Secured city) తయారు చేసేందుకు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని కూడా కేటీఆర్ గుర్తు చేశారు.
గత ప్రభుత్వంలో దారుణమైన నేరస్థులను కూడా కొన్ని గంటల్లో పట్టుకున్న పోలీస్ యంత్రాంగం, ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతల మేరకు పనిచేస్తుందని, శాంతిభద్రతల రక్షణలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ముఖ్యమంత్రి చేతగానితనం వలనే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లాయన్నారు. ఇంతటి దారుణమైన అరాచక పాలనకు త్వరలోనే ముగింపు లభిస్తుందని, రానున్న రెండు సంవత్సరాల్లోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, తిరిగి రాష్ట్రంలో శాంతిభద్రతలను కట్టుదిట్టం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
పోలీసులు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల ఆదేశాల మేరకు ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకొని పనిచేయడం మానేయాలని, తమ ప్రాథమిక బాధ్యత శాంతిభద్రతల పైన దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. ఒకవేళ పోలీస్ అధికారులు తమ పద్ధతి, తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.