-కేంద్ర నిధులు దారిమళ్లించారు….నరేగా నిధులు తినేశారు
-సర్పంచ్ కు ఉన్న కామన్ సెన్స్ కూడా సిఎం జగన్ కు లేదు
-సిఎం జగన్ నమ్మితే ఏమవుతుందో సుబ్రహ్మణ్యం, సవాంగ్ లను చూస్తే తెలుస్తుంది
-జగన్ అబద్దాన్ని అతికేలా చెప్పారు…మనం నిజాన్ని నమ్మేలా చెపుదాం
-టిడిపి సర్పంచ్ ల అవగాహన సదస్సులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: పంచాయతీ వ్యవస్థను జగన్ సర్కార్ సర్వ నాశనం చేసిందని…సర్పంచ్ ల హక్కులు కాలరాస్తున్న వైసిపి ప్రభుత్వంపై పోరాటం చెయ్యాలని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం లో సర్పంచ్ ల అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన సర్పంచ్ లకు దిశా నిర్థేశం చేశారు. కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ, టిడిపి సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్ ను చంద్రబాబు అభినందించారు.
రౌడీయిజాన్ని ఎదుర్కొని పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ లు గెలిచారని….తప్పుడు కేసులు పెట్టి నాడు పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులను వేధించారని గుర్తు చేశారు. రాజీ లేని పోరాటంతో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అందరికీ అభినందనలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాలను
కూడా ఫలితాలను తారుమారు చేసి వైసీపీ తమ ఖాతాలో వేసుకుందని చంద్రబాబు అన్నారు. ప్రధానికి, ముఖ్యమంత్రి కి రాజ్యాంగం ఏలా అధికారం ఇచ్చిందో…సర్పంచ్ కి అదే విధంగా అధికారం ఇచ్చిందని….రాజ్యాంగం సర్పంచ్ లకు ఇచ్చిన హక్కులను ఎలా తొలగిస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సచివాలయం అధిపతి సీఎం అయ్యినప్పుడు…గ్రామ సచివాలయం అధిపతి సర్పంచ్ కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్ల ను పెట్టి సర్పంచ్ ల అధికారాలను తొలగిస్తారా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 73 వ రాజ్యాంగ సవరణ ప్రకారం వచ్చిన హక్కులలో పంచాయతీలకు 19 హక్కులు అందేలా టిడిపి ప్రభుత్వం చేసిందని చంద్రబాబు అన్నారు. తెలుగు దేశం హయాం లో వేసిన రోడ్లే తప్ప గ్రామాల్లో ఒక్క రోడ్డు వైసీపీ వాళ్ళు వెయ్యలేదని అన్నారు. 14,15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల్లో 7658 కోట్ల నిధులు వైసిపి దారి మళ్లించిందని…వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. జల్ జీవన్ పథకం లో రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల 3 వేల కోట్లు నిలిచిపోయాయని చెప్పారు. అనంతపురం జిల్లాలో సత్య సాయి వాటర్ స్కీమ్ లో….సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పథకం మూత పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ లకు ఉండే కామన్ సెన్స్ కూడా సీఎంకు లేదని చంద్రబాబు మండిపడ్డారు.
సిఎం జగన్ వైఖరి ఏంటో మళ్లీ తెలిసింది
నాడు CSగా ఉన్న ఎల్ వి సుబ్రహ్మణ్యంను సీఎం జగన్…. సుబ్రమణ్యం అన్నా అని పిలిచి చివరికి ఆయన్ను ఏమి చేశాడో చూశారు కదా అని అన్నారు. ఇక డీజీపీ ని సవాంగ్ అన్నా అని… చివరికి పీకేశారని అన్నారు. డిజిపిగా నాడు సవాంగ్ చేసిన పనులను తాము సమర్ధించడం లేదని….పోలీసు వ్యవస్థను
నిర్వీర్యం చేశారని చంద్రబాబు అన్నారు. నా కాన్వాయ్ పై రాళ్ళు వేస్తే భావప్రకటన అని సవాంగ్ చెప్పాడు. మంత్రి అప్పల రాజు పోలీసులపై దాడి చేస్తే చర్యలు మాత్రం తీసుకోలేదని గుర్తు చేశారు. వివేక హత్య లో అవినాష్ రెడ్డి పాత్ర పై సీబీఐ ఛార్జ్ షీట్ లో పెడితే….సమాధానం చెప్పలేని సకల శాఖల మంత్రి సజ్జల… సీబీఐ కక్ష కట్టిందని అంటున్నారని చంద్రబాబు అన్నారు. కోర్టు లు లేకపోతే ఎంపీ రాఘురామ రాజు ను ఏమి చేసేవాళ్ళో? చంపేసేవారేమో అని చంద్రబాబు అన్నారు. 26 వేల కోట్ల నరేగా నిధులు వస్తే 3 ఏళ్లలో వైసీపీ ఒక్క రోడ్డు వెయ్యలేదని…పేదలకు ఇళ్ల స్థలాల కార్యక్రమం లో స్థలాల చదును పేరుతో వేల కోట్లు కొట్టేసారని అన్నారు. టీడీపీ హయాంలో చేసిన 2500 కోట్ల నరేగా పనులకు బిల్లులు ఇవ్వకుండా వేధించారు. టీడీపీ న్యాయ పోరాటం చేస్తే అందులో 1400 కోట్లు మాత్రమే ఇప్పటికి ఇచ్చారు…. ఇంకా 1100 కోట్లు రావాల్సి ఉంది అన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత నరేగాలో 261 కోట్లు అవినీతి అని కేంద్రం తేల్చిందని చంద్రబాబు అన్నారు.
అబద్ధాన్ని అతికేలా చెప్పిన జగన్:
సిఎం జగన్ అబద్దాన్ని కూడా అతికేలా చెప్పాడని…అలా చెప్పే అనేక విషయాల్లో ప్రజలను నమ్మించి మోసం చేశారని అన్నారు. వివేకా హత్యలో ప్రతి పక్షంలో జగన్ ఏమన్నారు….ఇప్పుడు ఏం చేస్తున్నారో
అంతా అర్థం చేసుకోవాలని అన్నారు. జగన్ అబద్దాన్ని అతికేలా చెపుతున్నప్పుడు…..మనం నిజాన్ని నమ్మేలా ఎందుకు వివరించలేకపోతున్నాం అన్ని చంద్రబాబు సమావేశంలో అన్నారు. గ్రామా స్థాయి నుంచి ఇప్పుడు ప్రజలకు నిజాలు వివరించే పని మొదలు పెట్టాలని….ఆ పని సర్పంచ్ ల స్థాయి నుంచి మొదలు అవ్వాలని చంద్రబాబు అన్నారు.