ఆ రహస్య కోణంపై దర్యాప్తు జరపాలి
ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం, అక్టోబర్ 16: వ్యాపార భాగస్వాములు రామోజీ, జగన్నాధరెడ్డిలు చైనా & జెకోస్లోవేకియాలకు దేశ రహస్యాలు అందించిన దేశద్రోహులని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు. 1962 నవంబర్లో చైనాతో యుద్ధానికి నెల ముందు అక్రమార్జనతో రామోజీ చిట్ ఫండ్ కంపెనీ ప్రారంభించాడని అతని రహస్య కోణంపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
రామోజీ రెండో కుమారుడు సుమన్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదనతో మాట్లాడుతూ, ఒంట్లో కాన్సర్ పుడితే గెలవచ్చు. ఇంట్లో తండ్రి కాన్సర్ గా మారితే గెలవలేము. దాని చేతుల్లోనే నేను ఓడిపోయాను” అని బరువెక్కిన హృదయంతో అన్న మాటలు ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికీ కలిచివేసిందని గుర్తుచేశారు. రామోజీకి ఎవరిపైనా ప్రేమ ఉండదు,తనను తాను ప్రేమించుకునే రకం అతనిది. డబ్బు, కీర్తి, అహంకారం అంటే అయనకు మిక్కిలి మక్కువ. కన్నకొడుకైనా, తల్లి, భార్య అయినా తన ఆస్తుల తర్వాతే అన్నది అతని నైజమని అన్నారు. 1974 ఆగస్టు 10 ఈనాడు మొదటి సంచికలో నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తామని చెప్పి ఇప్పుడు ఒక కుల పత్రిక గా మారిపోయిందని, ఒక పార్టీకి కరపత్రంగా సేవలందిస్తుందని మండిపడ్డారు.
ఆర్బీకే వ్యవస్థపై కేరళ అధికారులు ప్రశంసల జల్లు
రైతు భరోసా కేంద్రాల సేవలు అద్భుతమని వాటిని సందర్శించిన కేరళ అధికారులు ప్రశంసించారని విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ తరహాలోనే ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ను కేరళలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్బీకేల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు సేవలందిస్తున్న తీరు అద్భుతమని, రైతుల కోసం ఇంత మెరుగైన వ్యవస్థను తీసుకొచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి హాట్సాఫ్ అని కేరళ అధికారులు కొనియాడారని అన్నారు..