– 2014 కి మందు మీ స్థాయి ఏంటి
– కేశినేని నాని వ్యాఖ్యలను ఖండించిన కంచికచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు
నిన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని అధినేత నారా చంద్రబాబు మీద యువ నాయకుడు లోకేష్ గారి మీద చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యక్తుల కన్నా వ్యవస్థలు ముఖ్యం అన్న సంగతి నాని తెలుసుకోవాలి. నీళ్లలో ఉన్నంత వరకే మొసలి బలం పార్టీలో ఉన్నంత వరకే నాయకులకి విలువ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ నాయకుల పార్టీ కాదు రెండు సార్లు ఎంపీ అవ్వడానికి కారణం గ్రామాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తల కష్టం మాత్రమే.
రతన్ టాటా గారి స్థాయి అని చెప్పుకునే మీరు ఇవాళ 16 నెలలు జైలులో గడిపిన ఒక ఆర్ధిక నేరగాడి పంచన చేరి మీరు మాట్లాడిన మాటలు మీ అహంకార పూరిత వైఖరిని తెలియచేస్తుంది. లోకేష్ ని అనే ముందు 2014 కి మందు మీ స్థాయి ఏంటి అనేది ఆలోచించుకోవాలి..మీకు ఇష్టం అయితే జగన్ భజన చేసుకోండి కానీ మా నాయకులని విమర్శిస్తే మాత్రం సహించేది లేదు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల లోని తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు