– ఒంటిమిట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా నిర్వహించిన అనంతరం ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో జె.శ్యామలరావు, కడప కలెక్టర్ శ్రీధర్ ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉందని, పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు తగినవిధంగా సౌకర్యాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒంటిమిట్ట క్షేత్రం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రివర్యుల సమీక్షలో ముఖ్యాంశాలు
– తిరుపతి కాణిపాకం- తాళ్లపాక , గండికోట (నైట్ హాల్ట్) – ఒంటిమిట్ట మరియు శ్రీ కాళహస్తి, సర్క్యూట్‌లను 2 రోజుల/3 రోజుల పర్యటనతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని టీటీడీ, టూరిజం శాఖకు ఆదేశం.
– ఒంటిమిట్ట చెరువును సుందరీకరించి, బోటింగ్ సౌకర్యంతో మధ్యలో జాంబవంతుని విగ్రహం ఏర్పాటు .
– టీటీడీ, దాతలు, ప్రయివేట్ ఆపరేటర్ల ద్వారా ఒంటిమిట్టలో వసతి మెరుగుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశం. మిగిలిన ఆలయ పునరుద్ధరణ పనులన్నీ ASI సహాయంతో చేపట్టాలని సూచన.
– రామతీర్థం, లక్ష్మణ తీర్థం తీర్థాల యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ అభివృద్ధి.
– రామాయణం, హిందూత్వ విలువలను తెలిపే విధంగా పోతనగిరి పై శ్రీరామ ప్రాజెక్టు
– ఒంటిమిట్టలో భక్తులందరికీ నిత్యాన్నదానం ప్రారంభించేందుకు అన్నప్రసాద భవనం నిర్మాణం
– ఒంటిమిట్టను ఆధ్యాత్మిక క్షేత్రంగా ,మతపరమైన టూరిజం సర్క్యూట్‌లో భాగంగా చేయడానికి ఆలయం, పరిసర ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి, యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఒక బృహత్తర ప్రణాళిక తయారు