Suryaa.co.in

Telangana

డాక్టర్లకు రాబోయే రోజుల్లో ఏఐ పెద్ద చాలెంజ్

– హెల్త్ కేర్ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చాము
– చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ స్నాతకోత్సవంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్, పేషంట్లతో డాక్టర్లు సరిగా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుందన్నారు.

నా చిన్నతనంలో మా అమ్మ కూడా నేను డాక్టర్ కావాలని కోరుకుంది. వ్యక్తిగత జీవితం, ప్రాధాన్యతలను కూడా పక్కన పెట్టి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని కెసిఆర్ నాకు చెప్పారు. డాక్టర్లు పేషంట్లతో సరిగా మాట్లాడితే 50% జబ్బు నయమవుతుంది. ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రూపంలో డాక్టర్లకు రాబోయే రోజుల్లో పెద్ద చాలెంజ్ ఎదురు కాబోతుంది. చాట్ జిపిటి , గ్రోక్ లు ప్రిస్కిప్షన్ లు కూడా రాస్తున్నాయి. ఏఐ ఇచ్చే సమాచారం ఆధారంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్ల దగ్గరకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పేషెంట్లను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కరుణ, సానుభూతి తో రోగులకు డాక్టర్లు సేవ చేయాలి.

బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. హెల్త్ కేర్ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చాము. వైద్యరంగంలో తెలంగాణ సాధించబోయే ప్రగతిలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

LEAVE A RESPONSE