Suryaa.co.in

Telangana

నువ్వు ఓట్ ఫర్ నోట్ కు బ్రాండ్ అంబాసిడర్!

– రేవంత్ రెడ్డి పాలన ఆగం ఆగం… సగం.. సగం
– ఎగవేత రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్
– అబద్దాల అంబాసిడర్ రేవంత్ రెడ్డి
– గుండెల్లో గుడి కట్టుకున్న జెండా గులాబీ జెండా
– మళ్ళీ కెసిఆర్ కావాలి… రావాలంటున్నారు
– ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో.. అంతే స్పీడ్ గా పడిపోయింది
– సిద్దిపేట పట్టణ, చిన్నకోడూరు మండలం పార్టీ సమావేశం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట: 14 ఏళ్ల పోరాటం… ఉద్యమ పంథా చరిత్ర ఉన్న గులాబీ జెండా కు పురుడు పోసిన గడ్డ సిద్దిపేట అని సిద్దిపేట 25ఏళ్ల కీర్తి ఈ మట్టి బిడ్డలకె ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.. సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో 27 న జరిగే పార్టీ రజతోత్సవం సందర్బంగా జన సమీకరణ ఫై సిద్దిపేట పట్టణ, చిన్న కోడూరు మండల పార్టీ సమావేశం లో పాల్గొన్నారు.. 27న పెద్ద ఎత్తునా తరలాలి అని చెప్పారు. పల్లె పల్లె నా జెండా ఎగరవేయాలి.. పెద్ద ఎత్తున తరలాలి అని కోరారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో ముమ్మాటికీ గులాబీ జెండా నె గుడి కట్టుకుంది అని హరీష్ రావు అన్నారు.. కెసిఆర్ మళ్ళీ కావాలి రావాలి అని ప్రజలుకోరుకుంటున్నారన్నారు కెసిఆర్ హయాంలో పెట్టు బడులు వచ్చాయని తెలంగాణ ధనిక రాష్ట్రం గా ఆదర్శం గా నిలిచిందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి ఎంత స్పీడ్ గా వచ్చిందో.. ఎన్నికల తరవాత ఎగవేతల తో అంతే స్పీడ్ గా పడిపోయిందన్నారు.. నాది యంగ్ ఇండియా బ్రాండ్ అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. నువ్ ఎందులో బ్రాండ్ అంబాసిడర్ ప్రజలు చెప్పుతారు అని హరీష్ రావు రేవంత్ రెడ్డి ఫై మండిపడ్డారు.

” నువ్ ఓట్ ఫర్ నోట్ కు బ్రాండ్ అంబా సిడర్, పేగులు మేడల వేసుకుంటా అనడం లో… బూతులు మాట్లాడడం లో.. లగ చెర్ల రైతు లను జైల్లో పెట్టడం లో హైడ్రా తో ఇల్లు కూర్చడం లో… అడవులను నరికేయడం లో.. రేవంత్ రెడ్డి అంబా సిడర్ అని ఏద్దేవా చేశారు.. పాలనా అంత ఆగం.. ఆగం.. సగం సగం అని, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణ మాఫీ సగం చేసాడు.. గ్యాస్ సిలెండర్ సగం మందికే.. ఉచిత కరెంట్ సగం సగం నె.. నాడు నొ ఎల్ ఆర్ ఎస్.. నో బి ఆర్ ఎస్ అని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు మాట్లాడారు.. నేడు ఎల్ ఆర్ ఎస్ ను ముక్కు పిండి వసులు చేస్తున్నారు.. హోడింగ్స్ పెట్టి కట్టాలి అని ప్రజల మీద భారం వేస్తున్నారని మండిపడ్డారు.. బి ఆర్ ఎస్ చేస్తే తప్పు.. కాంగ్రెస్ చేస్తే ఒప్పా… రేవంత్ రెడ్డి ఉద్దెర మాటలు.. ఉల్టా పాలన..

బి ఆర్ ఎస్ వాళ్లు కాళ్ళ ల్లో కట్టే పెడుతున్నారు అని మాట్లాడుతుండు.. ఎందుకు మహిళలకు 2500 ఇస్తా అంటే నా? 4వేల పెన్షన్ చేస్తా అంటే నా.. తులం బంగారం కెసిఆర్ కిట్ రైతు బందు 15000 ఇస్తా అని ఇవ్వకుంటే కట్టే పెట్టామా? పాలన చేత కాక ఉద్దెర మాటలు మాట్లాడుతుండు అబద్దాలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి.

LEAVE A RESPONSE