Suryaa.co.in

Andhra Pradesh

మున్సిపల్ పాఠశాలకు కస్టమ్స్,జీఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డి వితరణ

సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంపై సానుకూల ప్రభావం చూపించడానికి కస్టమ్స్, జీఎస్టీ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఆ శాఖ కమిషనర్ సాధు నరసింహారెడ్డి అన్నారు. గుజ్జనగుండ్ల లోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలకు కస్టమ్స్, జీఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డి సందర్శించి, పాఠశాల అభివృద్ధికి సహకారం అందించారు.

పాఠశాల భవనానికి పెయింటింగ్ కు అయ్యే ఖర్చును నగదు రూపంలో అందచేసారు. పాఠశాలకు ఐరన్ బీరువా, స్టాఫ్ టేబుల్స్, ఇరవై కుర్చీలను బహుకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలకు అన్నీ సౌకర్యాలను కల్పించటంలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. విద్యతో పాటు మౌలిక సౌకర్యాలలో కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దటానికి సామాజిక బాధ్యతగా భావించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా భావించి, సహకారం అందించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ నిధుల ద్వారా కస్టమ్స్, జీఎస్టీ కమిషనరేట్లు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదుకోవటానికి తమ శాఖ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

అనంతరం పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. పాఠశాలలోని సౌకర్యాలు పరిశీలించి భవిష్యత్ లో అండగా నిలుస్తామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకారం అందించిన కమిషనర్ నరసింహారెడ్డి ని పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు.

తొలుత కమిషనర్ విద్యార్థులతో వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానోపాధ్యాయులు బి. నరసింహారావు కమిషనర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి. నరసింహారావు అధ్యాపకులు ఎం.భాస్కరరావు, కె.సుధారాణి జీఎస్టీ అధికారులు చీదేళ్ళ ఈశ్వరరావు, వరకుమార్, సాధిక్ ఆలీ, పూర్ణ సాయి, కాకర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE