Suryaa.co.in

Telangana

ఎస్ ఎల్ బీ సీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి

– భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

హైదరాబాద్: ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదం పైన అందుకు బాధ్యులైన వారి పైన విచారణ చేపట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా ఎస్ ఎల్ బీ సీ సొరంగ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది.

ఇంతకుముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి సహా, అనేక అంశాలపై న్యాయ కమిషన్‌ల ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక న్యాయ కమిషన్‌లు ఏర్పాటు చేశారు. తాజా ప్రమాదాలపై న్యాయ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని మేము మా పార్టీ తరఫున, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆర్మీ మరియు ఇతర సంస్థల సహాయంతో ఎస్ ఎల్ బి సి టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా ప్రభుత్వం మరింతగా కృషి చేయాలి.

LEAVE A RESPONSE