భారత్ గొప్పతనంపై మనకు మనం చెప్పుకోవడం, ప్రశంసించుకోవడం రొటీన్. మన దేశం ప్రపంచానికి ఎలా ఆదర్శమయిందో ప్రచారం చేయడమూ అంతే రొటీన్. కానీ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూమతం గొప్పతనం గురించి విదేశీయులు వారి దేశాల్లో పాట పాడటమే రొటీన్‌కు భిన్నం. ఇప్పుడు ఆ
గొప్పతనాన్ని తన సొంతం చేసుకున్న ఓ స్పెయిన్ మహిళ పాడిన పాట సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. స్పెయిన్ దేశ రేడియోలో ఆ మహిళ మన దేశ ఔన్నత్యం గురించి ప్రపంచానికి చెబుతూ, అభియంతో పాడిన పాట ఇప్పుడు ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. మీరూ వినండి. మేరా భారత్ మహాన్!