Suryaa.co.in

Andhra Pradesh

కార్యకర్తలు సంయమనం పాటించాలి

-బాంబులు గుర్తించినా పోలీసుల గోప్యమెందుకు?
-ఎన్నికల సంఘం, డీజీపీ, చీఫ్‌ సెక్రటరీ విఫలం

-కూటమి రాగానే అరాచకవాదులపై చర్యలు
-గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు

పల్నాడులో దాడులపై గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు స్పందించా రు. ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దాడులకు పాల్పడ్డారు. దాడులు నియంత్రించటంలో ఎన్నికల సంఘం, డీజీపీ, చీఫ్‌ సెక్రటరీ విఫలమయ్యారు. పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం ఇంకా వైసీపీ కనుసన్నల్లో పనిచేస్తోంది. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో భారీగా బాంబులు బయటపడ్డాయి. నిన్న రాత్రి బాంబులు గుర్తించినా ఇప్పటివరకూ పోలీసులు గోప్యంగా ఉంచారు.

ఈ వ్యవహారంలో పోలీసులు వైసీపీ నేతలను తప్పిస్తారని అనుమానంగా ఉంది. పల్నాడులో తెదేపా నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి. వైసీపీకి కావాల్సింది అరాచకాలు, మనకు కావాల్సింది పల్నాడు అభివృద్ధి. కూటమి ప్రభుత్వం రాగానే అరాచకవాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. జూన్‌ 4న ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. ఐదేళ్లు వైసీపీ అరాచకాలకు తట్టుకుని నిలబడిన కార్యకర్తలకు అండగా ఉంటాను.

LEAVE A RESPONSE