Suryaa.co.in

Business News Features

ఆహా… తెలివంటే అదానీదే!

డబ్బు ఎస్‌బీఐ ఇస్తుంటే రైతులకు అప్పు మాత్రం అదానీ ఇస్తాడు….లాభాలు మాత్రం సగం సగం. ఎస్‌బీఐ కు అదానీ క్యాపిటల్ కు రైతులకు రుణాలు మంజూరు చేయడానికి కో లెండింగ్ అగ్రిమెంట్ జరిగింది.

ఎస్‌బీఐ గురించి ఓ సారి తెలుసుకుందాం
22000 బ్రాంచ్ లు
60,000 ఏటీఎమ్ లు
48,00,000 కోట్ల రూపాయలు ఆస్తులు ..
1,40,00,000 రైతు ఖాతాలు..
రైతులకు ఇచ్చిన రుణాలు 2,00,000 కోట్ల రూపాయలు.

అదానీ క్యాపిటల్ గురించి కూడా ఓసారి తెలుసుకుందాం…
60 బ్రాంచ్ లు
13000 కోట్ల రూపాయలు ఆస్తులు
28000 రైతు ఖాతాలు
రైతులకు ఇచ్చిన రుణాలు
1300 కోట్ల రూపాయలు

ఈ కో లెండింగ్ అగ్రిమెంట్ ఎలా అంటే…
రైతులకు ఇచ్చే రుణాలలో
80 శాతం ఎస్‌బీఐ పెట్టుబడి పెడుతుంది…
20 శాతం అదానీ క్యాపిటల్ పెట్టుబడి పెడుతుంది…
పెట్టుబడి మాత్రమే ఎస్‌బీఐ వారిది..
రుణాలు ఇవ్వడం, రైతులు ఎంపిక అంతా
అదానీ క్యాపిటల్ చేస్తాదట…
డబ్బు ఎస్‌బీఐ ఇస్తుంటే రైతులకు అప్పు మాత్రం అదానీ ఇస్తాడు….
లాభాలు మాత్రం సగం సగం …
ప్రపంచం మొత్తం మీద ఇటువంటి అగ్రిమెంట్ ఎక్కడైనా జరగడం ఎవరైనా చూసారా…?
కొంతకాలానికి అదానీ క్యాపిటల్ బ్రాంచ్ లు విస్తరించాలి… ఎస్బిఐ బ్రాంచ్ లు తగ్గిపోవాలి….. కస్టమర్లు అందరూ అదానీ క్యాపిటల్ కు మారిపోవాలి…
ఎస్బిఐ మూసేయాలి.
దేశాన్ని, బ్యాంకింగ్ రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్న దుర్మార్గులు ఎవరో ఇప్పటికయినా అర్థం అయితే అందరం చేయు చేయు కలిపి వారిని తరిమి కొడదాం.

– మంజరి

LEAVE A RESPONSE