Suryaa.co.in

Andhra Pradesh

అదానిని వెంటనే అరెస్టు చేయాలి

– మోడికి అదాని ఫండ్ రైజర్
– కోర్టు సుమోటోగా దర్యాప్తు చేయాలి
– ఎఐసిసి వైస్ ప్రెసిడెంట్ కొలనుకొడ శివాజీ డిమాండ్

విజయవాడ: గత దశాబ్ద కాలంగా దేశ సంపద అంతా గుజరాత్, భారత్కు చెందిన ప్రపంచ కుబేరులు అదానికి మోడి, యన్టిఎ ప్రభుత్వం ఆయాచితంగా, అనైతికంగా ప్రభుత్వ సంస్థల ఆస్థులు ఏకపక్షంగా కట్టబెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తూనే వున్నాం.

పార్లమెంటు లోపల, బయట కూడా అనేక సందర్భాలలో అదాని మరియు వారి సంస్థలు చేస్తున్న ఇన్ సైడ్ ట్రేడింగ్ మీద స్పష్టమైన ఆధారాలు ప్రభుత్వానికి మరియు వివిధ రకాలైన స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు అందజేస్తూ మోడి ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు బుల్డోజ్ చేస్తున్నది.

భారత ప్రభుత్వ సెబి సెక్యూరిటీ ఎక్సేంజ్ అధినేత మాధభి బూచ్ కూడా దర్యాప్తు చేయమని ప్రతిపక్షాలు, కోర్టులు చెప్పినా కూడా విషయాన్ని సాగదీసి దర్యాప్తు నత్తనడకక తీరులో సాగింది.

హెడెన్ బర్గ్ నివేదిక కూడా గత సంవత్సరములో ఇచ్చిన నివేదికలో భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ అక్రమాల ద్వారా డబ్బుని సంపాదిస్తున్నాడు అని ఆధారాలతో ఆరోపణ చేసిన తరువాత మోడి అదానీని కాపాడుతూ క్విడ్ ప్రోకోగా లబ్ది పొందుతున్నారు. ఇప్పుడు అమెరికా స్టాక్ ఎక్సేంజ్ అదాని రూ.2110 కోట్ల లంచాల కేసు వెలుగు చూసింది.

తక్షణమే భారత దర్యాప్తు ఏజెన్సీలు, సెబి, సివిఐ, ఇడిలతో జెపిసితో దర్యాప్తు చేయించాలి. అదాని మీద ఎఫ్ఎస్ఐఆర్ ఫైల్చేయాలి. సమన్లు జారీ చేసి అరెస్టు చేయాలి.

ఎపి ప్రభుత్వం పెద్దలు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగేలా విద్యుత్ ఒప్పందాలు కుదిరిన ఎపి డిస్కం అధికారుల మీద దర్యాప్తుకి ఆదేశించాలని, అందుకు బాధ్యులన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

అదాని, మోడీ ఇద్దరూ ఒకటే. అదాని మోడికి ఫండ్ రైజర్. మోడి బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, కెన్యా, అమెరికా, ఇతర దేశాలతోటి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకొనే ఏజెంట్ గా భారత ప్రధాని పనిచేయడం దురదృష్టకరం. తక్షణమే అత్యున్నత కోర్టు సుమోటోగా దర్యాప్తు చేయాలి.

LEAVE A RESPONSE