అద్వానీ కి భారతరత్న ప్రదానం

ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

భాజపా అగ్ర నేత, మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ కి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

 

Leave a Reply