Home » సాయం అనేది ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి..

సాయం అనేది ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి..

-కానుకల ఆశ చూపించి ముగ్గురు మహిళలను బలి తీసుకోవడం దారుణం..
-తొక్కిసలాట ఘటనపై జిల్లా ఎస్సీని సమగ్ర నివేదిక కోరాం
-మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

చీరల పంపిణీ, కానుకల పేరుతో గుంటూరులో సభపెట్టి ముగ్గురు నిరుపేద మహిళల ప్రాణాలను చంద్రబాబు బలితీసుకున్నాడని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. పేదరికం శాపం కాదు అని… పేదలను హేళన చేసే విషయం కాదు అని .. పేద మహిళాలకు కానుకల ఆశ చూపించి ముగ్గురు మహిళలను బలి తీసుకోవడం దారుణం అన్నారు. కేవలం చిల్లర సరుకుల కోసం నిండు ప్రాణాల పోగొట్టుకున్న ఈ పరిస్థితిని నిలదీయాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళా కమిషన్…గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగిందని వాసిరెడ్డి పద్మ తెలిపారు… పరిహారముతో గాయపడిన కుటుంబాల గాయం మానుతుందా అని ప్రశ్నించారు.

గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన పేదలకు కానుకల పంపిణీ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వాసిరెడ్డి పద్మ సోమవారం పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందడం బాధాకరమన్నారు. చంద్రబాబు దర్శకత్వంలోనే గుంటూరులో సభ జరిగిందని, తప్పించుకోవడానికి ట్రస్ట్‌ పేరుpadma1 చెబుతున్నారన్నారు. కానుకల పేరుతో మహిళలకు ఆశ చూపించారని, కొంతమందికి టోకెన్లు ఇచ్చి, మరికొంతమందికి సభకు వచ్చాక ఇస్తామని నిరుపేద మహిళలకు ఆశచూపించారని, ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఘటన జరిగిందన్నారు. కందుకూరులో 8 మంది ప్రాణాలు బలితీసుకున్న కొద్దిరోజుల్లోనే గుంటూరులో మరో ముగ్గురి మరణాలకు కారణమయ్యారని, గుంటూరులో సభను ఆర్గనైజ్‌ చేసింది టీడీపీనే అని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, చనిపోయిన మహిళలు అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందినవారేనన్నారు. ముగ్గురు ప్రాణాలను బలితీసుకొని, ఐదుగురిని విషమ పరిస్థితుల్లోకి నెట్టింది చంద్రబాబేనన్నారు. పేద మహిళలంటే చంద్రబాబుకు అంత చులకనా అని ప్రశ్నించారు. కందుకూరు సభ తర్వాత చంద్రబాబులో పశ్చాత్తాపమే కనిపించడం లేదన్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనపై జిల్లా ఎస్సీని సమగ్ర నివేదిక కోరామని, ఉయ్యూరు ఫౌండేషన్, చంద్రబాబు వివరణ ఇవ్వాల్సిందేనన్నారు. సహాయం అంటే సొంత డబ్బా కొట్టుకోవడం అనే పద్ధతుల్లో వ్యవహరించడం చాలా తప్పు అన్నారు.

కందుకూరికి సంఘటన మరవకముందే ట్రస్ట్ పేరుతో తెలుగుదేశం పార్టీ సభ నిర్వహించి, పేద మహిళలకు చీరాల పంపిణి అంటూ ప్రచారం నిర్వహించిందన్నారు… టిడిపి ప్రచార వల్లలో పడి పేద మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. ఇందులో డైరెక్షన్, ప్రయెజనం చంద్రబాబునాయుడు దే అన్నారు. సాయం అనేది ఆత్మగౌరవం పెంచే విధంగా ఉండాలన్నారు. సాయం పేరుతో పేద మహిళల ప్రాణాలు బలి తీసుకోవడం దారుణం అన్నారు. కానుక పేరుతో ఇచ్చే కిట్టు చూస్తే…నాసిరకం చీర, కందిపప్పు, బెల్లం, నూనె… సాయం అంటే ఇదేనా అని చంద్రబాబును ప్రశ్నించారు.

ప్రభుత్వంలో జరుగుతున్న సహాయం మీ కంటికి కనబడడం లేదా..
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదవారికి దాదాపు రెండు లక్షల కోట్లు రూపాయల సహాయం అందజేయడం జరిగింది… అది కూడా వారి ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎక్కడా ఎవరు క్యూలు కట్టి తీసుకోలేదు. ఎక్కడ తొక్కేసేలాట జరగలేదు. ఎక్కడ మహిళలు ఇబ్బంది పడలేదు… ఎవరు… ఎవరి ముందు చేయిచాచి సహాయం కోరలేదు… ఏ నాయకుడి కరుణ.. దయ కోసం వెంపర్లాడలేదు… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు బటన్ నొక్కగానే పేదలు వారి ఖాతాల్లోకి వాళ్ళు ఇంటి వద్దకే సాయం అందిందన్నారు..

సాయం అంటే ఈ రకంగా చేయాలి సహాయ పడాలనుకుంటే వారి మార్పు కి వారి అభివృద్ధికి సహాయం ఉపయోగపడాలి….చిల్లర సరుకులు చిల్లర సంచులు పట్టుకొని మేము సహాయం చేస్తున్నామంటూ ప్రచారం నిర్వహించి… దండోరా వేసుకొని వేల మందిని పరిగెత్తించి… ప్రజలను పరిగెత్తించి ఒకరి మీద ఒకరు పడేలా చేసి వారు చావండి అంటూ వారిని వదిలేసి మాకు ప్రచారం వస్తే చాలు అనుకునే విధంగా చేయడం చంద్రబాబు కే సొంతం అని ఎద్దేవా చేశారు.

ఈ విధానంగా చేయడం ఏమిటో 40 సంవత్సరాల అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలి. పేద మహిళలంటే ఆయనకు ఉన్న గౌరవం ఏమిటో ఈ సంఘటలే నిదర్శనంగా చూపుతున్నాయి. పేదలు మహిళలు, కూలి పనుల చేసుకునే వాళ్ళ అంటే మీకు చులకన అందుకే ఈ విధంగా చేశారు.. లేదంటే కానుకలను ఇంటింటికి మీరే పంపిణీ చేయవచ్చు కదా అలా ఎందుకు చేయలేదు.

ఈరోజు ఒకటో తేదీన అవ్వ తాతలు వారి ఇంటి వద్దనే పెన్షన్ అందుకుంటున్నారు.. ఇది మీకు కనబడుతుందా… మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి మంచి పనులు ఎందుకు చేయలేదు… కందుకూరి సభ తర్వాత ఒక పశ్చాత్తాపం లేదు గుణపాఠం లేదు. జరిగిన విషాదంలో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకోవాలన్నారు. పేదలు ఎస్సీ ఎస్టీ మహిళలు టిడిపి వైపే ఉన్నారని చూపించుకోవాలని దురుద్దేశంతో చేసిన రాజకీయ సభ ఇది.

ఈ సంఘటనపై జిల్లా ఎస్పీని సమగ్ర నివేదిక కోరాం. కానుకుల పేరిట ఏమని ఆశపెట్టారు. పేద మహిళలు ఎవరికి ఎన్ని కానుకలు ఇచ్చారు. వాటి విలువ ఎంత… చీర పప్పు బెల్లానికి పేద మహిళల ప్రాణాలు తీసుకుంటే దానిమీద లెక్క అడగాల్సిన భాద్యత అందరికీ ఉందన్నారు… దీని పై ఉయ్యురు ఫౌండేషన్, చంద్రబాబు వివరణ ఇవ్వాలని, ఘటనకు బాధ్యత వహించాలన్నారు.

Leave a Reply