– డాక్టర్ నూకసాని
అమరావతి: ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం తథ్యం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని ముందుగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసన సభ్యులు నజీర్ అహ్మద్ తో కార్యాలయంలో భేటీ అనంతరం ఆలపాటి రాజేంద్రప్రసాద్ కార్యాలయం నందు ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు శ్రద్ధ పెడితే భారీ మెజారిటీతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు ఖాయమని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివ`ద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ చెప్పారు. కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రచార బాధ్యతలను తెలుగుదేశం పార్టీ నూకసాని బాలాజీకి అప్పగించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులతో తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి సమావేశమయ్యారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారనడానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడమే నిదర్శనమన్నారు. తనకున్న సమాచారం ప్రకారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు సానుకూల స్పందన ఉందన్నారు. ఇదే క్రమంలో ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ పెడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పారు.
సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న విలువ ఎనలేనిదన్నారు. వీరు చెపితే అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తారని చెపుతూ తమ వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు, ఇతరులను కూడా ఆలపాటికి మద్దతుగా ఓటేసేందుకు సమాయత్తం చేయాలన్నారు. గత ఐదేళ్లుగా జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దే చర్యలకు చంద్రబాబు నాయుడు నేత`త్వంలోని ప్రభుత్వం చేస్తున్న కృషి అన్ని వర్గాల ఆదరణ పొందుతోందన్నారు. దీనిని ద`ష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి తెదేపా అభ్యర్థిని గెలిపించాలన్నారు.
కొందరికి టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని టీచర్లు సహచరులతో ఓటేయించడంతో పాటు వారి సాయంతో ఇతరులను కూడా ఓటేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను అద్బుత మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా డాక్టర్ నూకసాని బాలాజీ చెప్పారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ , రాష్ట్ర కల్చరల్ చైర్మన్ పోడపాటి తేజస్విని , రైల్వే బోర్డ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మరియు టీచర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.