Home » తెలుగు గడ్డమీద పుట్టిన వారంతా నా కుటుంబ సభ్యులే

తెలుగు గడ్డమీద పుట్టిన వారంతా నా కుటుంబ సభ్యులే

-సర్వ జనుల సంక్షేమమే ద్వేయంగా మ్యానిఫెస్టో రూపొందించాం
-జగన్ పై తిరుగుబాటు పులివెందుల నుంచే మొదలైంది
-ముస్లింలకు న్యాయం చేసే ఏకైక పార్టీ టీడీపీనే
-జగన్ లాంటి అహంకారులు రాజకీయాలకు పనికిరారు
-వైసీపీ దొంగల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
-తెనాలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

తెనాలి: మన మ్యానిఫెస్టోకు, సైకో మ్యానిఫెస్టోకు తేడా ఉందా? లేదా? వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు, అవకాశాలు, ఆదాయాల్ని కోల్పోయారు. నిత్యవసర ధరలు పెరిగిపోయాయి. సంక్షేమం, అభివృద్దితో సుపరిపాలన సాధ్యం. పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతులకు ఆదాయం పెరగాలి. ఆంద్రా ప్యారిస్ తెనాలి అమరావతిలో భాగం. అమరావతి రాజధాని అయ్యి ఉంటే తెనాలి అభివృద్ది చెంది ఉండేది. నాడు నేను సైబారాబాద్ కడితే 9 మున్సిపాలిటీలు హైదరాబాద్ లో కలిశాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు పక్కల అన్ని ప్రాంతాలు బాగుపడ్డాయి. నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ హైదరాబాద్ ని విద్వంసం చేయలేదు. సైకో అమరావతిని విద్వంసం చేశాడు. ప్రజా వేదిక కూల్చి విద్వంసంతో పాలన ప్రారంభించారు. చరిత్రలో ఇలాంటి నీచుడిని ఎపుడైనా చూశారా?

జగన్ లాంటి అహంకారులు రాజకీయాలకు పనికిరారు
రాష్ట్ర విభజనతో అందరూ బాధపడ్డాం. సమైక్యాంద్ర కోసం పోరాటం చేశాం, కానీ విభజన తప్పలేదు. తెలుగు జాతి కోసం అమరావతికి శ్రీకారం చుట్టి హైదరాబాద్ కంటే ఎక్కువగా అభివృద్ది చేయాలని సంకల్పించాం. పోలవరం నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఏడాదిలో పట్టిసీమను నిర్మించి 120 టీఎంసీలతో 30 రోజుల ముందే ఖరీఫ్ పంటకు నీళ్లిచ్చాం. ప్రజా జీవితంలో కక్ష్యలుండకూడదు. నాకు జగన్ కి ఏమైనా ఆస్తులు, పొలం తగాదాలున్నాయా? ప్రజాస్వామ్యంలో నాయకుల మద్య ఉండేది రాజకీయ విభేదాలు మాత్రమే. కానీ వైసీపీ సైకోలు అసెంబ్లీలో నన్ను, నా కుటుంబ సభ్యుల్ని అవమానించారు. పవన్ ని బూతులు తిడుతున్నారు. అహంకారులు రాజకీయాలకు పనికిరారు. ఇలాంటి సైకోలను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలి.

నాకు పదవులు కొత్త కాదు, పవన్ సినిమాలు చేసుకుంటే డబ్బులు వస్తాయి, కానీ మేం ఎవరి కోసం కప్టపడుతున్నాం. రాష్ట్రం నిలవాలి, ప్రజలు గెలవాలన్న సంకల్పంతో మేం పొత్తుతో ముందుకొచ్చాం. చిన్న పిల్లలు సైతం టీడీపీ జెండాలు పట్టి..మా భవిష్యత్తు కోసం టీడీపీకి ఓటేయండి మీ గ్రామాల్లో ప్రజలను అడగాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదు…వైసీపీ విముక్త రాష్ర్టమే లక్ష్యంగా పొత్తు తప్పలేదని పవన్ చెప్పారు. పొత్తు కోసం తన సీటును త్యాగం చేసిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అతన్ని గుర్తుపెట్టుకుంటా న్యాయం చేస్తా. ఈ త్యాగాలకు పలితాలు కనపడాలంటే భారీ మెజార్టీతో నాదెండ్ల మనోహన్ ర్ ని ఎమ్మెల్యేగా, ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ ని గెలిపించాలి. మనోహర్ కి పడే ప్రతి ఓటు చంద్రశేఖర్ కి పడాలి, చంద్రశేఖర్ కి పడే ప్రతి ఓటు మనోహర్ కి పడాలి.

ముస్లింలకు న్యాయం చేసే ఏకైక పార్టీ టీడీపీనే
టీడీపీ హయాంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేశాం. అన్న క్యాంటీన్ రద్దు చేసి పేదల పొట్ట కొట్టిన జగన్ పేదల మనిషా? చంద్రన్న భీమా కింద ఎవరైనా చనిపోతే రూ. 5 లక్షలిచ్చి ఆకుంటుబాన్ని ఆదుకున్నాం. ముస్లింలకు రంజాన్ తోఫా రద్దు చేశాడు. నాడు దుల్హన్ కింద 36 వేల మంది ముస్లిం యువతులకు పెళ్లికానుకలు ఇచ్చాం. ముస్లింల రిజర్వేషన్ల కోసం సుప్రీం కోర్టులో న్యాయవాదిని పెట్టి మీ తరపున పోరాటం చేశాం. మసీదులకు ఆర్దిక సాయం చేశా, షాదీఖానాలు నిర్మించాం.

విదేశీ విద్య ఇచ్చాం, ఇమామ్, మౌజమ్ లకు వేతనాలిచ్చాం. నేను వస్తే మసీదులు కూలుస్తానని జగన్ అనటం సిగ్గుచేటు, మసీదులు కూల్చేది జగన్ , కట్టేది నేను. ఎవరైనా మసీదులు కూల్చితే తాటతీస్తా. ఎన్.ఆర్సీ బిల్లుకు పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది వైసీపీ కాదా? వైసీపీ గెలిచినా బీజేపీకి సపోర్ట్ చేస్తారు, రహస్యంగా ఒప్పందాలు చేసుకునే వ్యక్తి నన్ను విమర్శిస్తారా? నేను బహిరంగం పొత్తు పెట్టుకున్నాం. రాష్ట్రం కోసమే పొత్తు. జగన్ రూ. 13 లక్షల కోట్లు అప్పులు చేశాడు.ఇలాంటి పరిస్ధితుల్లో కేంద్రం సహాయం లేకపోతే నిస్సహాయ స్ధితిలో ఉండాల్సి వస్తుంది. అందుకే మీ అందరికి చెప్పి పొత్తు పెట్టుకున్నా.

జగన్ పై తిరుగుబాటు పులివెందుల నుంచే మొదలైంది
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే మీ భూములు మీ పేర్ల మీద ఉండవు. పులివెందులలో బాస్కర్ రెడ్డి అనే వ్యక్తి….మా భూములపై మీ భర్త పోటో ఏంటని జగన్ సతీమణి భారతిరెడ్డిని నిలదీశాడు. జగన్ పై తిరుగుబాటు పులివెందుల నుంచే ప్రారంభమైంది. ప్రజలు దైర్యంగా ముందుకు రావాలి. రాష్ట్రానికి పట్టిన సైకో భూతాన్ని వదలించుకోవాలి. క్లైమోర్ బాంబులకే భయపడని నేను , గబ్బర్ సింగ్ లాంటి పవన్ ఈ సైకో బెదిరింపులకు భయపడతామా? నువ్వు రౌడీయిజం చేయడానికి ఇది పులివెందుల కాదు, తెలుగు జాతి తెలివైన జాతి సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాతపెడతారు.

సర్వ జనుల సంక్షేమమే ద్వేయంగా మ్యానిఫెస్టో రూపొందించాం
నాయకునికి చేయగలనన్న నమ్మకం ఉండాలి. 2019 లో మనం ఇచ్చిన ఖజానా జగన్ కి బటన్ నొక్కడానికి ఉపయోగపడింది. కమీషన్ల కోసం పరిశ్రమలు వెళ్లగొట్టారు, అమరావతిని నాశనం చేశారు. పోలవరాన్ని ఆపేశారు, అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు, మద్యం పై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టారు. చేతకాదని జగన్ చేతులెత్తేశాడు. జగన్ మ్యానిఫెస్టో వెల వెలబోతే మన మ్యానిఫెస్టో కళకళలాడుతోంది. నాకు నమ్మకం ఉంది, సంపద సృష్టిస్తా దాన్ని పేదలకు పంచుతా. పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికా లాంటి దేశంలో బ్రహ్మాండంగా రాణించారు. అది మన తెలుగు జాతి సత్తా. నన్ను అరెస్ట్ చేసిన సమయంలో 70 దేశాల్లో నిరసనలు చేశారు, అన్నిదేశాల్లో మన వాళ్లు స్థిరపడ్డారు. ఇంత తెలివి ఉండి కూడా సైకో చేతిలో నిస్సహాయులుగా మిగిలిపోయాం.

హైదరాబాద్ లో మనం చేసిన అభివృద్దిని తర్వాత ముఖ్యమంత్రులు విద్వంసం చేయలేదు, ఎవరైనా తాను చేసిన అభివృద్ది ఉండాలి, అది కొనగసాగాలి దాని పలితాలు సమాజానికి అందాలని కోరుకుంటారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో జరిగింది, తెలుగు జాతికి ఆ ఫలితాలు దక్కాయి. నేడు ఒక సైకో ఇక్కడ మొత్తం నాశనం చేశాడు. రాజధాని కూడా లేకుండా సైకో ఏపీ పరువు తీశాడు. అందరం కలిసి సమైక్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి దేశంలోనే నెం.1 రాష్ట్రంగా చేయాలన్నదే నా సంకల్పం.

భారతదేశాన్ని 2027 నాటికి ప్రపంచలో నెం.1 దేశంగా చేయాలన్నది మోదీ ఆశయం. నేను ఎప్పుడో విజన్ 2020 తయారు చేశా ఆంధప్రదేశ్ కి అది నిజమైంది. ఇప్పుడు నా ఆశయం 2047 కి ప్రపంచలోనే తెలుగు జాతి నెం. 1 గా ఉండాలన్నదే నా ఆశయం.

తెలుగు గడ్డమీద పుట్టిన వారంతా నా కుటుంబ సభ్యులే
క్రిష్టియన్, ముస్లిం..అన్ని కులాలు, మతాలు తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే, ఎవరి నమ్మకాలు వారికుంటాయి, ఆద్యాత్మిక వెలుసుబాట్లు ఉంటాయి. అందరి అభివృద్దే నా ఆశయం. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే లక్ష్యం. టెక్నాలజీ ద్వారా తక్కువ కష్టంతో ఎక్కువ పనులు చేసి ఎక్కువ ఆదాయం పొందేలా చేస్తాం. ప్రజలే మన ఆస్తి, ఐదు కోట్ల మందిని సక్రమంగా నడిపిస్తే ప్రగతి సాధించి బ్రహ్మాండమైన సంపద సృష్టించటం. పెంచిన సంపద పేదలకు పంచుతాం. మీ జీవితాల్లో వెలుగులు తెచ్చేలా మ్యానిఫెస్టో రూపొందించాం.

తెనాలి ఎమ్మెల్యే దొంగ
తెనాలి చరిత్రలో ఎన్నడూ లేని అరాచకాలు వైసీపీ పాలనలో జరిగాయి. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ సెంటు పట్టా భూమిలో రూ. 80 కోట్లు దోచుకున్నాడు. మున్సిపల్ ఎన్నికల సమయంలో వైసీపీ దొంగలే వెళ్లి.. మన అభ్యర్ది ఇంట్లో మద్యం బాటిల్లు పెట్టి అక్రమ కేసు పెట్టాలని చూశాడు. సీసీ కెమెరాలు ఉండటంతో వైసీపీ దొంగలు దొరికారు. ప్రశ్నిస్తే మీ ఇంట్లో గంజాయి, డ్రగ్స్, మద్యం పెట్టి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించాడు. అంతటి దుర్మార్గుడు ఈ ఎమ్మెల్యే. వెంచర్లు వేయాలంటే శివకుమార్ టాక్స్ కట్టాలి. రేపు మళ్లీ గెలిస్తే శివకుమార్ ట్యాక్స్ చట్టం తెస్తాడు. ఆర్యవైశ్యులపై దాడి చేస్తారా? ఖబడ్దార్ జాగ్రత్త. మార్కెట్ వ్యాపారుల నుంచి ప్రతి నెల రౌడీలను పంపి మామూళ్లు వసూలు చేస్తున్నారు. రోజు కొన్ని వందల లారీలు ఇసుక అమ్ముకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తి స్వాతి ముత్యం అని సీఎం అంటున్నాడు.

అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు అంట. బాబాయిని లేపేసిన వ్యక్తి అమాయకుడా? టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగిస్తాం. సైకోకి వ్యతిరేకంగా గ్రామాలు గ్రామాలు తిరగబడాలి, ఓటు వేయకపోతే ఏమవుతుందని ఇంట్లో పడుకోవద్దు. గొడ్డలి మీ ఇంటికి వస్తుంది, సమర్దవంతమైన ప్రభుత్వం లేకపోతే ప్రజలకు రక్షణ ఉండదు. మీ ఇంట్లో నుంచి బయటకెళ్లిన ఆడబిడ్డ మళ్లీ తిరిగొస్తుందన్న నమ్మకం ఉండదు. మీ ఇళ్లు, ఆస్తులు కబ్జా చేస్తారు, మీరు ఏం చేయలేని నిస్సహాయ స్ధితిలో ఉంటారు. గుంటూరులో రంగ నాయకమ్మ అనే మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు హైదరాబాద్ కి పారిపోయే పరిస్ధితి వచ్చింది. ఆరుద్ర అనే అమ్మాయి ఆస్తి మంత్రి కబ్జా చేస్తే వారణాసికి వెళ్లి తలదాచుకుంది.

వైసీపీ మళ్లీ గెలిస్తే ఇంతకంటే దారుణాలు జరుగుతాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఓటు వజ్రాయుదం. బాద్యత లేకుండా వ్యవహరిస్తే దెబ్బతింటాం. రూ. 5 వేలు రూ. 10 వేలు తీసుకుని ఓటేస్తే జీవితాలు మారవు, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాతో వేల కోట్లు దోచుకున్న దొంగలు వైసీపీ నేతలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Leave a Reply