Suryaa.co.in

Andhra Pradesh

న్యాయవాదిపై దాడి అంటే న్యాయంపై దాడి జరిగినట్టే

– టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు

నంద్యాల జిల్లా, కొలిమిగుండ్లలో దళిత న్యాయవాద మంద విజయ్ కుమార్ పై జరిగిన దాడి న్యాయంపై జరిగిన దాడిగా జ్యుడీషియల్ వ్యవస్థ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, న్యాయమూర్తులు ఈ దాడిని తీవ్రంగా పరిగణించాలి. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ విధానాలు తన పార్టీ కార్యకర్తలను కూడా అదే బాటలో నడిపిస్తున్నాయనడానికి విజయ్ కుమార్ పై దాడి నిలువుటద్దంలా నిలుస్తుంది.

వైసీపీ కి చెందిన కబ్జాదారులు, గూండాలు, రౌడీలు తమ నిరంకుశ విధానాలను నిలదీసిన వారిపై, అడ్డుకున్నవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇవి జగన్మోహన్ రెడ్డి కొంత మంది ప్రభుత్వ పెద్దల వెనకుండి, ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదల భూములకు రక్షణ లేకుండా పోయింది. పేదవాళ్ల భూములు కబ్జాకు గురైతే..ఆ కబ్జాదారులపై న్యాయపరమైన పోరాటం చేస్తున్న దళిత న్యాయమూర్తి, అడ్డువెళ్లిన తన తల్లిపైనా వైసీపీ సైకోలు దాడి చేయడం హేయమైన చర్య.

నిందితులే ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడం పోలీసు వ్యవస్థకు మాయని మచ్చ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయనడానికి నిదర్శనం. గతంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన హైకోర్టు జడ్జిలను సైతం వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ కార్యకర్తలు తీవ్రమైన పరుష పదజాలంతో కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ కేసు దర్యాప్తును అంగుళం కూడా ముందుకు తీసుకెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి పాదసేవలో తరిస్తూ స్వామిభక్తిని చాటుతోంది.

ప్రభుత్వ దుర్మార్గాలు, వైసీపీ సైకోల ఆగడాలను నిలదీసిన వారిపై మాత్రం సీఐడీ విరుచుకుపడుతోంది. న్యాయవ్యవస్థపై దాడులు చేస్తున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వం దళిత, న్యాయవ్యవస్థ చేతిలో మట్టికరవక తప్పదు. ప్రజాస్వామ్యవాదులంతా దళిత న్యాయమూర్తి విజయ్ కుమార్, తన తల్లిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాలని, యావత్ న్యాయవ్యవస్థ విజయ్ కుమార్ కు న్యాయం జరిగే వరకు అండగా నిలవాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE