Home » జగన్‌ పాలనలో మైనారిటీలపై అరాచకాలు, అక్రమకేసులు

జగన్‌ పాలనలో మైనారిటీలపై అరాచకాలు, అక్రమకేసులు

-మైనారిటీలకు మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే
-ముస్లింలకు పథకాలు రద్దు చేసి మోసగించారు
-కూటమి వస్తేనే న్యాయం జరుగుతుంది
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
-నియోజకవర్గ ముస్లిం, నూర్‌బాషాల ఆత్మీయ సమావేశం

మైనారిటీలకు తెలుగుదేశం ప్రభుత్వం మేలు చేస్తే వైసీపీ ప్రభుత్వం మోసగించిందని సత్తెనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం కాకతీయ కల్యాణ మండపంలో ఆదివారం ముస్లిం మైనారిటీ, నూర్‌ బాషాల నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా కన్నా లక్ష్మీనారాయణతో పాటు మాజీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. ముం దుగా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌, లాల్‌ జాన్‌బాషా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. క

న్నా మాట్లాడుతూ జగన్‌రెడ్డి ప్రభుత్వంలో ముస్లింలను అంధకారంలోకి నెట్టి బానిసలుగా మార్చేశాడని విమర్శించారు. రంజాన్‌ తోఫా లేదు.. మైనారిటీలకు విదేశీ విద్యను దూరం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా మైనారిటీలపై అక్రమ కేసులు పెట్టించి దురాగతాలకు పాల్పడ్డ ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. షాదీఖానా ఎక్కడ, మైనారిటీ నిధులు ఎక్కడ, దుకాణ్‌ మఖాన్‌ పథకం ఎక్కడ అని ప్రశ్నిం చారు. గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా తేరలేపి ఇప్పుడు మరలా కొత్తగా గులక రాయి డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు. మైనార్టీలకు మంచి జరగాలన్నా …పథకాలు తిరిగి ప్రారంభించా లన్నా కూటమిని గెలిపించుకోవాలని పిలుపుని చ్చారు.

షరీఫ్‌ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వల్ల మనకు ఒరిగింది ఏమీలేదని, తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు మేలు జరిగిందని గుర్తుచేశారు. ఈ సైకో జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత మన ముస్లింల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులు పెరిగిపో యాయన్నారు. మనకు ఉన్న అన్ని పథకాలు రద్దు చేసిందన వివరించారు. మన కార్పొరేషన్లకు చెందిన డబ్బులు మొత్తం వారి ఖాతాలో జమ చేసుకున్నారని.. ప్రశ్నిస్తే మనపైనే దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ జైల్లో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు న్యాయం జరగా లంటే కూటమిని గెలిపిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply