Suryaa.co.in

Andhra Pradesh

స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 జాతీయ అవార్డులలో మరోసారి సత్తాచాటిన ఆంధ్ర ప్రదేశ్

– స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు

స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 జాతీయ స్థాయి పురస్కారాలలో పలు అవార్డుల కైవసం చేసుకోవటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ మరోసారి సత్తాచాటిందని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించే అతి పెద్ద పారిశుద్ధ్య సర్వేలో దేశంలోనే అత్యుత్తమ నగరాలుగా గ్రేటర్ విశాఖ , విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర పాలక సంస్థలు 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయన్నారు.

పులివెందుల పురపాలక సంఘం రాష్ట్ర స్థాయిలో అవార్డు కైవసం చేసుకుందన్నారు. విజయవాడ నగర పాలక సంస్ధ 2021, 2022, 2023 సంవత్సరాలలో వరుసగా ఇండియా క్లీనెస్ట్ సిటీ, క్లీన్ స్టేట్ క్యాపిటల్, జాతీయ అవార్డు అవార్డులను పొందిందన్నారు. విశాఖ నగరం 2021 నుండి 2023 వరకు వరుసగా బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్, క్లీన్ బిగ్ సిటీ, జాతీయ అవార్డు సాధించిందన్నారు. తిరుపతి నగరం బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ (2021), సఫాయి మిత్ర సురక్షిత్ ప్రెసిడెంట్ అవార్డు (2022), జాతీయ అవార్డు (2023) దక్కించుకుందన్నారు. పుంగనూరు పురపాలక సంఘం 2021, 2022 సంవత్సరాలలో బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ అవార్డులను, పులివెందుల 2022 సంత్సరంలో ఇన్నోవేషన్, బెస్ట్ ప్రాక్టీస్ అవార్డును, 2023లో స్టేట్ అవార్డులను దక్కించుకున్నాయన్నారు.

ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి మంచి ఫలితాల దిశగా పునరంకితం అవుతామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గనిర్ధేకత్వ, విప్లవాత్మక నిర్ణయాల వల్లే అవార్డులు గత మూడేళ్లలో మంచి ఫలితాలు సాధించగలిగామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు జాతీయస్తాయి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడమే ఇందుకు నిదర్శనమని గంధం చంద్రుడు స్పష్టం చేసారు. పారిశుద్ధ్య నిర్వహణలో పట్టణాభివృద్ధి శాఖ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నదని ముఖ్యమంత్రి సైతం ప్రశంసించారని, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అందిస్తున్న సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు, మార్గదర్శకత్వం అవార్డుల సాధనకు ఎంతో ఉపకరించాయన్నారు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ అవశ్యకతను నొక్కి చెబుతూ ప్రణాళికాబద్దంగా పనిచేసేలా స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ను ప్రోత్సహిస్తూ వచ్చారని గంధం చంద్రుడు తెలిపారు. పురపాలక శాఖ కమీషనర్ కోటేశ్వరరావు, సిఎంఓ అధికారులు పారిశుద్య నిర్వహణ పట్ల నిరంతరం సలహాలు ఇస్తూ రావటం వల్లే ఇన్ని సంవత్సరాలుగా ఈ ఘనతను దక్కించుకున్నామన్నారు.

LEAVE A RESPONSE