Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ నాయకుల పనితీరు భేష్

– ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు

విశాఖపట్నం: యోగంద్రానిర్వహణపై ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఎంపీ భరత్‌తో ప్రధాని మోదీ మాటా మంతీలో పాల్గొన్నారు. ప్రపంచం ఏపీ వైపు చూసేలా చేశారని మోదీ వ్యాఖ్యానించారు. యోగాంధ్ర ద్వారా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నామని చంద్రబాబు ప్రధానితో అన్నారు. ఏపీ నాయకుల పనితీరు భేష్ అంటూ మోదీ ప్రశంసించారు.

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఇవాళ సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు.

LEAVE A RESPONSE