Suryaa.co.in

Editorial

అర్ధమైందా రాజా?!

– దటీజ్ బాబు
(మార్తి సుబ్రహ్మణ్యం)

మొన్న.. దర్శిలో.. మిట్ట మధ్యాహ్నం, 47 డిగ్రీల ఎండ. 75 ఏళ్ళ బాబు.. చొక్కా మొత్తం చెమటతో తడిసి పోయింది.. అంత డీహైడ్రేషన్ లో ఆపకుండా గంట సేపు జనాలతో మాట్లాడారు. భారీ వర్షంలోనూ తడుస్తూనే గంటల పాటు ప్రసంగించే ఓర్పు ఆయన సొంతం.

కుర్రాళ్లే ఎండకి అల్లాడిపోతుంటే, ఆయిన ఎలా అలా ఎండలో ఉండగలుగుతున్నారని అందరూ ఆశ్చర్యపోయారు! అదే సీఎం-వైసీపీ అధినేత జగన్ ఎండ దెబ్బ తగలకుండా, ఏసీ బస్సులో ప్రచారం చేశారు.వయసులోనే కాదు. కష్టపడే తత్వంలోనూ ఇద్దరికీ అదే తేడా!

75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు తిరుమల మెట్లు కుర్రాడిలా చకచకా ఎక్కేశారు. అదొక రికార్డు! పొలం గట్లపై నుంచి అవలీలగా జంప్ చేసిన నవ యువకుడాయన. కానీ యువకుడైన జగన్, కిందకు వంగి కొబ్బరికాయ కొట్టేందుకు నడుం వంచలేక, రాయినే పైకి తెప్పించి కొట్టిన వైచిత్రి. సోషల్‌మీడియా ట్రోల్స్ చూస్తే, జగన్ విమర్శిస్తున్నట్లు.. ఎవరు ముసలాడు? ఎవరు యువకుడన్నది తేలిపోతుంది.

లక్ష్యానికి ప్రాతిపదిక వయసు కాదు. సాధించాలన్న పట్టుదల, చిత్తశుద్ధి. అది బాబులో పుష్కలంగా ఉందన్నది, మొన్నటి సెగల సెల్సియస్‌లో కూడా ఎన్నికల ప్రసంగమే నిలువెత్తు నిదర్శనం. చొక్కా మొత్తం ఎండ వేడికి తడిసిపోయినా, చెక్కుచెదరకుండా ఎన్నికల ప్రసంగం పూర్తి చేసిన శ్రామికుడు. ఇప్పుడు అర్ధమైందా రాజా?!

LEAVE A RESPONSE