జీతాలు లేక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వెతలు

-జగన్ పాలనలో సలహాదారులకు సకాలనికి వేతనాలు.. జీతాలు లేక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్
ఉద్యోగుల వెతలు
-రాష్ట్రంలోని ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వని జగన్ రెడ్డి, దావోస్ లో ఎన్నిగొప్పలుచెప్పినా ఉపయోగంలేదు
ఉద్యోగులకు జీతాలివ్వలేని ముఖ్యమంత్రినినమ్మి, ఏపీకి పరిశ్రమలు వస్తాయా? జీతభత్యాలకోసం ఎదురు చూస్తున్న 13.42లక్షల మంది రోడ్డెక్కితే ప్రభుత్వం తలకిందులవుతుంది
• విద్యుత్ ఉద్యోగులు, మున్సిపల్ వర్కర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు జీతాలకోసం కళ్లుకాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు
• ప్రభుత్వసలహాదారులకు నెలనెలా ఠంఛన్ గా జీతభత్యాలు ఇస్తున్న ప్రభుత్వం, చిరుద్యోగులజీవితాలతో ఆడుకోవడం దారుణం
• ఉద్యోగుల బకాయిలు, రాష్ట్ర ఆర్థికస్థితిగతులపై ప్రభుత్వం పూర్తివివరాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

రాష్ట్రంలోని చిన్నఉద్యోగులు, ఆశావర్కర్లు, అంగన్ వాడీలు, మున్సిపల్ వర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలుఅందక నానాగడ్డీకరుస్తున్నారని, ఉద్యోగుల మెడికల్ బిల్లుల ఎరియర్స్ కూడా ప్రభుత్వం సక్రమంగా చెల్లించడంలేదని, ఇన్నిఇబ్బందుల్లోకూడా ప్రభుత్వ సలహాదారులు మాత్రం నెలనెలా ఠంఛన్ గా జీతభత్యాలు అందుతున్నాయని టీడీపీ ఎమ్మె ల్సీ పరుచూరిఅశోక్ బాబు తెలిపారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే …

“చిరుద్యోగులు,ప్రభుత్వశాఖల్లోని వారికి ముఖ్యమంత్రి దర్శనమే గగనమైంది. జీతాలురాక ఇబ్బందులు పడుతున్నవారు ప్రభుత్వవిభాగాల హెచ్ వోడీలతో మొరపెట్టుకుంటే, వారినుం చి తామేంచేయలేం అనే సమాధానం వస్తోంది. ప్రత్యేకవిమానంలో దావోస్ వెళ్లడంపై చూపిన శ్రద్ధలో సగమైనా ఈముఖ్యమంత్రి ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులో చూపితే బాగుండేదని ఉద్యోగులే అంటున్నారు. ప్రభుత్వ విభాగాల్లోని చిరుద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, అంగన్ వాడీ, ఆశావర్కర్లు, మున్సిపల్ సిబ్బందితో సహా వేతనాలకోసం వేచిచూస్తున్న 13.42లక్షలమంది 10రోజులపాటు సమ్మెకు దిగితే జగన్ ప్రభుత్వం తలకిందులవుతుంది.

మరీముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్యకార్మికులకు మెడికల్ అలవెన్సులు ఇస్తామనిచెప్పిన ప్రభుత్వం వారినుంచి రికవరీలుచేస్తోంది. గతంలో మున్సిపల్ వర్కర్లకు హెల్త్ అలవెన్స్ పేరుతో రూ.6వేలిచ్చిన ప్రభుత్వం, ఇప్పుడుదాన్ని జీతాలనుంచి రికవరీ చేస్తోంది. అది జీతం కంటే ఎక్కువ ఉండటంతో కొన్నిచోట్లజీతాలే ఆపేశారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియడంలేదు. పారిశుద్ధ్య కార్మికులు పనిచేసేదిలేదంటే రాష్ట్రంపరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. హెల్త్ కార్డుపేరుతో ఉద్యోగులనుంచి ప్రభుత్వం నెలకు రూ.300వరకు వసూలు చేస్తున్నాకూడా దాంతో ఉపయోగంలేదు. ప్రభుత్వమిచ్చిన హెల్త్ కార్డు నాలుకగీసుకోవడానికికూడా పనికిరాదు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులవారు ప్రభుత్వం నుంచి రూ.600కోట్లవరకు రావాలంటున్నారు.

దాంతో వారుఉద్యోగుల వైద్యసేవలకు విముఖుత చూపుతున్నారు. ప్రభుత్వఉద్యోగులు సీపీఎస్ రద్దు చేయాలంటే జీపీఎస్ ను తెరపైకి తెచ్చా రు. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఊసేఎత్తడంలేదు. జగన్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డీఏబకాయిలు వచ్చేప్రభుత్వం చెల్లించకపోతే ఉద్యోగులపరిస్థితి ఏమిటి? ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపాకనే వారికికష్టాలు మొదలయ్యాయి.వారికి దక్కాల్సిన బెనిఫిట్స్, పీఆర్సీ ఊసేలేదు. విద్యుత్ విభాగాల ఉద్యోగులుంతాకూడా జీతాలకోసం ఆవురావురుమంటు న్నారు. ఇలా అన్నివిభాగాల్లోని ఉద్యోగులుప్రభుత్వ బాధితులుగానే మిగిలారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే, ముఖ్యమంత్రేమో ఎక్కడోతిరుగుతూ, తమరాష్ట్రం పరిస్థితి బాగుందని చెప్పడం సిగ్గుచేటు.

ముందు జగన్ రెడ్డి, తనరాష్ట్రంలోని ఉద్యోగులజీవి తాలను బాగుచేశాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్నసంస్థలతో ప్రగల్భాలుపలికితే మంచిదని హితవుపలుకుతున్నాం. ఉద్యోగులవిషయంలో జగన్మోహన్ రెడ్డి గతంలోఇచ్చినహామీలను నిలబెట్టుకోలేదు. అవినెర వేరవని ఇప్పటికే ఉద్యోగులకు అర్థమైంది. కానీ వారు చేస్తున్నకష్టానికి తగిన ప్రతిఫలం (జీతం)కూడా సకాలంలో ఇవ్వకుంటే వారుఎలా బతకాలో ముఖ్యమంత్రిఆలోచించ కపోతే ఎలా? ఇలాంటి దీనమైన పరిస్థితి దేశంలో ఏరాష్ట్రంలోలేదు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము కూడా ప్రభుత్వం వాడుకోవడం సిగ్గుచేటు. ఉద్యోగుల ఇన్సూరెన్స్ సొమ్ము, మెడికల్ రీయింబర్స్ మెంట్ సొమ్ముకూడా రావడంలేదు. వీటన్నింటిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడితే ఆయనేమో ముఖ్యమంత్రే చేయాలి అంటారు. ఆర్థికమంత్రేమో పిట్టక థలతో కాలక్షేపం చేస్తున్నాడు.

ఉద్యోగ సంఘం మాజీ నేతగా ఉద్యోగులు బాధలు, వెతల్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా జీతభత్యాలకోసం ఎదురు చూస్తున్న 13.42లక్షలమంది చిరుద్యోగులు, వారికి సంబంధించిన జీతభత్యాలు, ఇతరత్రా బకాయిలపై తక్షణమే ఆర్థికమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం తరుపున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రభుత్య ఉద్యోగులకు ఎలాంటి బకాయిలుంది… ఎంతెంత చెల్లించాలి అనేవాటిపై కచ్చితమైన సమాచారంలేదు. కాబట్టి ప్రభుత్వమే ఉద్యోగుల జీతభత్యాలపై వాస్తవాలు చెప్పాలి. పీఆర్సీ ఉద్యమంలో ప్రభుత్వమే రూ.2,100కోట్లవరకు ఉద్యోగులకు బకాయిలు ఉన్నట్లుచెప్పింది.

ఇలా ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతబకాయి పడింది…మే-2022 ఆఖరునాటికి మొత్తం ఎంతచెల్లించాల్సి ఉందన్న పూర్తివివరాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలానే రాష్ట్రఆర్థికస్థితిగతులపై కూడా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఎక్కడోఅక్కడ అప్పులుపుడితేతప్ప ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి. ప్రభుత్వం ఇంకానాన్చివేతధోరణి అవలంభిస్తే కుదరదు. కచ్చితంగా ఉద్యోగులకు సమాధానంచె ప్పాల్సిందే.

గతంలో పీఆర్సీకోసం లక్షమంది ఉద్యోగులు రోడ్డెక్కితే ప్రభుత్వానికి దిమ్మతిరిగింది. ఉద్యోగసంఘం నేతలను భయపెట్టో, ప్రలోభపెట్టో నాటిఉద్యమాన్ని నీరు గార్చినప్రభుత్వనిర్వాకంతో ఉద్యోగులంతా అవస్థలుపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే, కేవలం ఉద్యోగసంఘాలే నేతలేకాదు. అసలు ముందు సక్రమంగా జీతాలుఇస్తే కదా… ఇతర బెనిఫిట్స్ గురించి మాట్లాడటానికి!. తెలుగుదేశంప్రభుత్వంలో జీతాలకోసం ఉద్యోగులు రోడ్లెక్కె పరిస్థితి ఎప్పుడూరాలేదు. అసలు ఉద్యోగుల ఉద్యమాలే టీడీపీహాయాంలో జరగ లేదు. కావాలంటే ఈఅంశంపై ఎవరితోనైనా సరే బహిరంగ చర్చకు తాము సిద్ధం.”

Leave a Reply