హిందువులపై దాడిని సహించం

-ఏప్రిల్ 23న వీర హనుమాన్ విజయ యాత్ర
-“హిందూ శక్తి ప్రదర్శన” యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు
-రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువుకు హనుమాన్ జయంతి ఆహ్వానం
-చెంగిచెర్లలో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన బాధితులపైనే కేసులు నమోదు చేయడం అ ప్రజాస్వామ్యం..
-దోషులను వదిలి నిందితులపై కేసులు పెడుతుంటే.. రజాకారుల పాలన గుర్తుకు వస్తోంది
-బజరంగ్ దళ్

“తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము” అని భజరంగ్ దళ్ హెచ్చరించింది. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ.. ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ , బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మాట్లాడారు. అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు. ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.

ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు.

భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు.

దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని.. ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు.

సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు. బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి , భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply