జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులపై దాడులు

* మైనారిటీ క్రిస్టియన్స్ పరిరక్షణే టిడిపి కర్తవ్యం
* అర్హులైన పాస్టర్ల అందరికీ గౌరవ వేతనం
* దళిత ఎస్సి స్టేటస్ ఇవ్వనున్న పార్టీ
* క్రిస్మస్ కు క్రిస్మస్ కానుకలు
* చర్చిల నిర్మాణానికి సాయం
* ఆస్తులు కాపాడుకోవడమే జగన్ లక్ష్యం
* బిజెపికి దొంగచోటుగా మద్దతు ఇచ్చింది వైసిపి
* ధైర్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేతులు కలిపింది టీడీపీ
* క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తా.. అండగా ఉంటా..
* ప్రశ్నిస్తే దళితులపై దాడులు, హత్యలు
* ఈ సైకో జగన్ దళిత ద్రోహి
– కేశినేని శివనాథ్ (చిన్ని )

జగ్గయ్యపేట: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు జగన్ లాగా బిజెపితో దొంగచాటు వ్యవహారాలు నడపట్లేదు. ధైర్యంగా ఏ విషయమైనా చెప్పే చేస్తున్నారు. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బిజెపితో జత కలిశారు. బిజెపితో జత కలిసినా మైనారిటీ క్రిస్టియన్స్ హక్కుల పరిరక్షణే టిడిపి ప్రథమ కర్తవ్యం. చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ హక్కులకి ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసుకుంటారని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని తెలియజేశారు.

మంగళవారం జగ్గయ్యపేట నియోజకవర్గ దైవ సేవకుల ఆత్మీయ సమ్మేళనం జగ్గయ్యపేట పట్టణంలోని శుభమస్తు కళ్యాణ మండపం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) పాటు, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నెట్టెం రఘురాం , బిజెపి జనసేన బలపరిచిన టిడిపి జగ్గయ్యపేట నియోజకవర్గ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ ” చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రైస్తవ ఆస్తులు మీద గాని, క్రైస్తవులపై గాని దాడులు దౌర్జన్యాలు జరగలేదు. ఈ సైకో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయి. గుంటూరులోని చర్చి స్థలాన్ని ఆక్రమించేందుకు, వైజాగ్ లోని ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు జగన్ విశ్వ ప్రయత్నం చేశాడు. క్రైస్తవుడు అని చెప్పుకునే జగన్ మీ అందరికీ అన్యాయమే చేశాడు. పాస్టర్ లందరికీ గౌరవ వేతనం ఇస్తానని చెప్పి ఓట్లు ఎంచుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లక్ష ఇరవై వేలమంది పాస్టర్లు ఉంటే 5000 మందికి కూడా గౌరవ వేతనం అందించలేదు.

బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి క్రిస్టియన్ కాలేడు. ఆ బైబిల్ లోని సూక్తులు ఆచరించిన వ్యక్తి నిజమైన క్రిస్టియన్ అవుతాడు. గత రెండేళ్లుగా ఎన్టీఆర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం జగన్ తన సొంత నిధులతో రాష్ట్ర ప్రజలకు కానీ, క్రైస్తవులకు కానీ చాక్లెట్ కూడా కొనిపెట్టలేదు. టిడిపి హయాంలో పేద క్రైస్తవులు క్రిస్మస్ పండుగ సంతోషంగా జరుపుకునేందుకు క్రిస్మస్ కానుకలు అందించాము. క్రైస్తవుడైన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా క్రిస్మస్ కానుకలు ఇవ్వలేదు.

కానుకలు ఇవ్వకపోవడం కాదు ఎస్సీలకు సంక్షేమాన్ని అందించే 27 పథకాలను రద్దు చేసిన దళిత ద్రోహి జగన్. మాస్క్ అడిగినందుకు దళితుడైన సుధాకర్ ని మానసికంగా హింసించి చనిపోయే వరకు వేధించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం దర్జాగా తిరుగుతున్నాడు. అంతేకాదు మణిపూర్ లో క్రిస్టియన్స్ మహిళలపై దారుణంగా దాడులు జరిగితే క్రైస్తవుల సంరక్షకుడిని అని చెప్పుకునే జగన్ ఆ సంఘటనను కనీసం ఖండించలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వాధికారులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా, పోలవరం ప్రాజెక్ట్, చింతలపూడి ప్రాజెక్టు పనులు తొందరగా పూర్తి చేయాలన్న కేంద్రం సహకారం కావాలి. అందుకే రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బిజెపితో, జనసేనతో కలిసి జత కలవడం జరిగింది.. జగన్ తన కేసుల నుంచి బయటపడటానికి, తన ఆస్తులు కాపాడుకోవడానికి మోడీతో దొంగచాటు వ్యవహారం నడుపుతున్నాడు. అందుకే మణిపూర్ ఘటనకి సంబంధించి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు వైసిపి బిజెపికి ఓటేసింది. టిడిపి దొంగచోటుగా కాదు ధైర్యంగా ప్రజలకు చెప్పి పయనిస్తుంది.

క్రైస్తవులు చర్చిలో ప్రార్థనలు జరుపుకునే సమయంలో ఎ లాంటి ఇబ్బంది తలెత్తినా, ఈ సమయంలోనైనా అందుబాటులో ఉంటాను. మీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటాను. టిడిపి హయాంలో ఏ మతం పైనా దాడులు జరగలేదు. ఏ మతం మీద దాడి జరిగినా మొదట స్పందించేది చంద్రబాబు. జగన్ కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు.. చంద్రబాబు కులం, మ‌తం చూడ‌రు..తెలుగు జాతి అభివృద్దిని మాత్ర‌మే చూస్తారు. యువ‌గ‌ళంలో యువనేత నారా లోకేష్ క్రిస్టియన్ సమస్యలను గుర్తించారు. రాబోయే మన ప్రజా ప్రభుత్వంలో క్రిస్టియన్స్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయబోతున్నారు. ఈ సమావేశంలో సీనియర్ పాస్టర్లు రాజారత్నం,యోహాన్, జి యోహన్,బి వై పి దాస్, భాస్కరరావు, జాను బాబు పీటర్ పాల్ కి శివనాథ్ ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి క్రిస్టియన్ అధ్యక్షులు ఈటే స్వామిదాసు , రాష్ట్ర టిడిపి క్రిస్టియన్ నాయకులు డాక్టర్ కామ దేవరాజు ,చెట్ల రాజశేఖర్ రాష్ట్ర టిడిపి క్రిస్టియన్ నాయకులు, జోసెఫ్ కిరణ్ టౌన్ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఓర్లు మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ , బి చంద్రపాల్, యోహాను ప్రభుదాస్, టి ప్రకాష్ రావు, కటికల అనిల్, లంకా ప్రవీణ్ కుమార్, హను నాయక్, సల్మాన్ రాజ్ పాల్గొన్నారు.

Leave a Reply