Suryaa.co.in

Andhra Pradesh

కాపు సామాజిక వర్గం మీద బాబు కక్ష

– వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు

కాకినాడ జిల్లా: కాపులపై కేసుల విషయంలో ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరిస్తున్నారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై కాపు సామాజికవర్గం భగ్గుమంటోంది. తమను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపులకు దిగడంపై యావత్‌ కాపు సామాజికవర్గం మండిపడుతోంది. ఆ సామాజికవర్గంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ తోట నరసింహం స్పందించారు, వారు ఏమన్నారంటే…

కాపు సామాజిక వర్గం మీద బాబు కక్ష

– వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు

కాపుల పట్ల కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుందని నిన్నటి జీవో చూసి షాక్ కు గురయ్యాను. రైల్వే కోర్టు కొట్టేసిన కేసును హైకోర్టులో అప్పీల్ చేయడమంటే కాపుల మీద కక్షసాధింపే. కాపు సామాజిక వర్గం మీద చంద్రబాబు ప్రభుత్వం ఎంత కక్ష పెట్టుకుందో ఏడాది తిరగక ముందే బయట పడింది.

కాపు ఉద్యమకారులు..ఆకలి కేకలతో కంచాలు కొట్టిన మహిళ మీద అప్పటి చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులు పెట్టింది. ఆ కేసులన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎత్తి వేశారు. కాపు ఉద్యకారులపై కేసులు తిరగతోడడం మంచి పరిణామం కాదు..దీనిని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి.

కాపులపై‌ మరోసారి చంద్రబాబు కక్ష

– వైఎస్ఆర్ సిపి,కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా

అధికారం ఉందని కాపులపై‌ మరోసారి చంద్రబాబు కక్షసాధిస్తున్నారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్నా…ఏరుదాటక బోడి మల్లన్న తీరు చంద్రబాబుది. కాపు ఉద్యమ సమయంలో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు మానసిక ఆనందం పొందారు. కాపులతో ఎస్సీ,బిసిల పై అక్రమ కేసులు పెట్టారు.

ఈ కేసులన్నింటిని మాజీ సిఎం వైఎస్ జగన్ ఎత్తివేశారు. కాపులపై కక్షసాధించాలనే చంద్రబాబు తీరును ఖండిస్తున్నాను. పేద ప్రజల కోసం పోరాడుతున్న వంగవీటి రంగాను చంద్రబాబు ఆధ్వర్యంలో హత్య చేశారు. రంగా హత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై అనేక అక్రమ కేసులు బనాయించారు.

కాపు మహిళలపై కేసులు పెట్టి చంద్రబాబు వికృత ఆనందం పొందారు. రంగా హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తులకు చంద్రబాబు ప్రమోషన్లు ఇచ్చి ,మంత్రులు,స్పీకర్లుగా చేశారు. ఈ తరం కాపులకు చంద్రబాబు చేసిన దోహ్రం తెలియదు.చంద్రబాబు ను గెలిపించినందుకు కాపులు మరోసారి అనుభవించాల్సిందే‌.

కాపు ఉద్యమకారులకు పవన్ కళ్యాణ్ ఇవాళ ఏం సమాధానం చెబుతారు?.

– జగ్గంపేట వైఎస్ఆర్ సిపి ఇన్చార్జి తోట నరసింహం

కాపు ఉద్యమకారులపై కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుంది. కాపుల పై ఉన్న ఆక్రోశాన్ని చంద్రబాబు కూటమీ ప్రభుత్వం వెల్లగక్కుతుంది. పవన్ ను నమ్మి చాల మంది కాపులు..కాపు ఉద్యమకారులు జనసేనలో చేరారు. ఇవాళ వారు జనసేనలో ముఖ్య నాయకులుగా ఉన్నారు.

కాపు ఉద్యమకారులకు పవన్ కళ్యాణ్ ఇవాళ ఏం సమాధానం చెబుతారు? న్యాయస్థానం తీర్పు ను సవాల్ చేస్తున్నారంటే కాపులపై కూటమి ప్రభుత్వానికి ఎంత ఆక్రోశం ఉందో అర్థమవుతోంది. రెడ్ బుక్ లో కాపులను అణచివేయాలని రాసే ఉంటారు

కూటమి కి మాత్రం కాపుల ఓట్లు కావాలి.కాపులే కాదు. దళితులు,బిసి ల మీద కక్ష సాధిస్తున్నారు.కాపులందరూ కూటమీ ప్రభుత్వం తీరుపై ఆలోచన చేయాలి

LEAVE A RESPONSE