Suryaa.co.in

National

కొమ్మినేనికి బెయిల్.. ఒక విశ్లేషణ

(కిరణ్)

కొమ్మినేని బెయిల్ పిటిషన్ తీర్పులో సుప్రీమ్ కోర్టు చేత ఇది స్పష్టంగా చెప్పబడింది.

పిటిషనర్ కొమ్మినేని దూషణాత్మకమైన వ్యాఖ్యలు చేయకూడదు మరియు అతను యాంకరింగ్ / హోస్టింగ్ చేస్తున్న టీవీ న్యూస్ షోలో అతని సమక్షంలో మరెవ్వరూ అటువంటి వ్యాఖ్యలు చేయకూడదని, దానిని యాంకర్ గా అతను అనుమతించకూడదు అని స్పష్టమైన ఆదేశం ఇచ్చారు.

విశ్లేషణాత్మక వ్యాఖ్య:

ఈ తీర్పు ద్వారా భారతీయ సుప్రీం కోర్టు ఒక ప్రధాన ప్రమాణాన్ని నెలకొల్పింది. ప్రజా వేదికలు అనేది ప్రజల అవగాహనను పెంపొందించేందుకు ఉండాలి కానీ, దురుద్దేశపూరితంగా వ్యక్తిగత విధ్వంసానికి వాడకూడదు. సాక్షి టీవీ, దీనికి విరుద్ధంగా నడుచుకుంటూ అమరావతి మహిళలను వేశ్యలు అని దూషించే, ప్రభుత్వ వ్యవస్థలను అపహాస్యం చేసే వేదికగా మారిపోయింది.

ఈ టీవీ ఛానెల్ వేదికగా దోపిడీ, పన్ను ఎగవేత, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు .. క్రిమినల్ కేసుల్లో ఉన్న సాక్షి టీవీ యజమానుల ప్రోత్సాహంతో అశ్లీలమైన, అసత్యమైన వ్యాఖ్యలు ప్రసారం చేశాయి. ఇది మీడియా స్వేచ్ఛ కాదు, మాఫియా స్వేచ్ఛ.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశం అతి ప్రాముఖ్యంగా నిలుస్తుంది. టీవీ చర్చల రూపంలో అసత్య ప్రకటనలు చేయవద్దు, ఎవరు చేసినా వారిని ఆపాలి, అనేది ఈ తీర్పు మూల సందేశం.

ప్రజలకు సందేశం

మీడియా వేదికలు ప్రజలకు నిజాలు చెప్పాలి, కానీ తప్పుడు ప్రచారం చేస్తూ న్యాయవ్యవస్థను మరియు ప్రభుత్వాన్ని అపహాస్యం చేయడం అత్యంత ప్రమాదకరం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పే చానెల్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి, సాక్షి లాంటి పార్టీ ప్రోపగండా చానెల్స్‌ను తిరస్కరించాలి.

LEAVE A RESPONSE