టీడీపీలో చేరిన బలిజనాడు కన్వీనర్ ఓవి రమణ

Spread the love

– ఆయన సేవలు వినియోగించుకుంటామన్న చంద్రబాబు

బలిజనాడు కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు డాక్టర్ ఓవి రమణ తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో రమణ టీడీపీ తీర్ధం తీసుకున్నారు. రమణ సేవలను పార్టీ వినియోగించుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రమణ గతంలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. జనతాదళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన రమణ, వివిధ అంశాలపై తరచూ పలు చానెళ్ల చర్చావేదికల్లో పాల్గొంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను తొలగించడాన్ని విమర్శిస్తూ, వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఒక తెలుగుపత్రికలో వ్యాసం రాశారు. దానితో నాటి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనను సస్పెండ్ చేశారు.

కాగా రాయలసీమ బలిజ వర్గాల్లో పట్టున్న తిరుపతికి చెందిన రమణ చేరికతో, ఒక బలిజ నేత టీడీపీకి ఆయుధంగా దొరికినట్టయింది. చంద్రబాబు రాజకీయ కార్యద ర్శి, జాతీయ పార్టీ కార్యాలయ సమన్వయకర్త టిడి జనార్దన్, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, కళా వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పరసా రత్నం తదితరులు రమణను అభినందించారు.

Leave a Reply