Suryaa.co.in

Andhra Pradesh

మానవత్వం చాటుకున్న ‘బీసీ’ మంత్రి!

నంద్యాల : పాణ్యం నియోజకవర్గంలో నంద్యాల రోడ్డులోని తుమ్మరాజు పాలెంలో రోడ్డు ప్రమాదానికి గురై ఓ మహిళ స్పృహ కోల్పోయింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి బనగానపల్లెకు వస్తున్న క్రమంలో బాధిత మహిళను చూసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి స్పందించారు. క్షతగాత్రురాలిని వెంటనే పాణ్యం ప్రభుత్వ ఆస్పత్రికి తన కాన్వాయ్ లో తరలించి, మెరుగైన వైద్యసాయం అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి మానవత హృదయంతో స్పందించిన తీరుకు పలువురు అభినందించారు.

LEAVE A RESPONSE