– తనిఖీలో గుర్తించిన పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలాజీ
గుంటూరు: గుంటూరు జిల్లాలోని పర్యాటక శాఖకు చెందిన కెవి మోటల్‌ను బుధవారం పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆకస్మిక తనిఖీ చేశారు. కెవి మోటల్ నిర్వహణలో పలు లోపాలను గుర్తించారు. పర్యాటక శాఖతో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధంగా హోటల్ నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. అనధికారికంగా, తగిన అనుమతులు లేకుండా బోట్లను నడుపుతున్న బోట్లను గుర్తించిన చైర్మన్ నిర్వహకులపై మండిపడ్డారు. వెంటనే అన్ని అక్రమ కార్యకలాపాలను నిలిపివేయాలని, అనధికారిక బోట్లను తొలగించాలని నూకసాని నిర్వాహకుల ను ఆదేశించారు.