Suryaa.co.in

Telangana

మల్కాజిగిరి గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే

-ప్రతి టెంట్ కింద గొంతు ఎత్తిన బిడ్డ ఈటల
-కేసీఆర్ లాగానే రేవంత్ కూడా కుట్రలు కుతంత్రాలు

మల్కాజిగిరి గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే. ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదు. దొంగ సర్వే రిపోర్ట్ లతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజగిరిలో సర్వేలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అనేక వర్గాల కోసం నేను పోరాటం చేశాను.

ప్రతి టెంట్ కింద గొంతు ఎత్తిన బిడ్డ ఈటల. ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. కేసీఆర్ లాగానే రేవంత్ కూడా కుట్రలు కుతంత్రాలు నమ్ముకున్నారు.
తెలంగాణ బరిగీసి కొట్లాడే గడ్డ.. ఆత్మగౌరవంతో చెలగాటం ఆడవద్దు. 22 ఏళ్లుగా నన్ను చూస్తున్న ప్రజలారా మీరే కథానాయకులపై నాకు ఓటు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
రెండు పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కోరుతున్న. మల్కాజిగిరి పట్ల నాకో విజన్ ఉంది. మల్కాజిగిరిని సంపూర్ణ అభివృద్ధి చేస్తా. సంపూర్ణ ఆశీర్వాదం అందించండి.

ఈ సభలో.. కంటోన్మెంట్ అభ్యర్థి వంశ తిలక్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎంఎల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బొడిగ శోభ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే ఎన్నికలో పోటీ చేసిన సామ రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, నియోజకవర్గ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, మల్లారెడ్డి, మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, రాజయ్య యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మల్క కొమరయ్య, సుధాకర్ గాండే, వీకే మహేష్, నారెడ్డి నందరెడ్డి, బాలసుబ్రమణ్యం, గిరివర్ధన్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. తర్వాత ఈటల నివాసం నుండి మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంవరకు బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో ఈటలతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈటలతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి ఇంచార్జ్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి వంశీ తిలక్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా, బీజేపీ రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE