ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విధ్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేతుల మీదుగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మెరిట్ విద్యార్థులని సన్మానించి,పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారని బిజెపి కార్యకర్తలను సోమువీర్రాజు అభినందించారు. బిజెపి ఆవిర్భావం సందర్భంగాసామాజిక వారోత్సవాలు బిజెపి పిలుపు నిచ్చింది ఇందులో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బొబ్బూరి శ్రీరామ్, ఎస్సీ మోర్చా నాయకుల్ని ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారిని ఎంతో అభినందనీయం అని సోము వీర్రాజు అన్నారు. మిషన్ వాత్సల్య పథకం గురించి సోమువీర్రాజు ఈ సందర్భంగా వివరించారు.
ఎవరైనా పిల్లలు 0 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. ఇది కొన్ని షరతులతో కూడుకొని ఉంటుంది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ పథకము కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఒక కుటుంబం లో ఇద్దరు పిల్లల వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.అలాగే శ్రీ వాత్సల్య భారతి పథకం ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లలుకు నెలకి 4000 రూపాయలు స్కీముని మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారు.
ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క స్కీములు కింద స్థాయి వరకు కూడా వెళ్లాలని నరేంద్ర మోడీ ఒక ఆశయం బడుగు బలమైన వర్గాలు ఉపయోగించుకోవాలని సోము వీర్రాజు అన్నారు . అవసరమైతే ఇక్కడ విద్యార్ధులు కూడా వినియోగించుకోవచ్చని అందుకు తన సహకారం ఉంటుందని సోమువీర్రాజు హామీ ఇచ్చారు. వైయస్సార్ కాలనీ శ్రీ గౌతమ్ స్కూల్ నందు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వైయస్సార్ కాలనీ ప్రతిభావంతులైన పేద విద్యార్థిని, విద్యార్థులకు , స్కాలర్ షిప్ లు అందజేసారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్,బిజెపి బాపట్ల ఇంచార్జి డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు, బిజెపి విజయనగరం జిల్లా ఇన్చార్జి అడ్డూరి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు బలివాడ శివకుమార్ పట్నాయక్ , బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ భాష, స్టేట్ కౌన్సిల్ సభ్యులు జంగం సునీల్ రాజు, మైలవరం నియోజకవర్గ కన్వీనర్ కుక్కపల్లి నాగేశ్వరరావు, బిజెపి ప్రధాన కార్యదర్శి వెంకట్, మహిళ నాయకురాలు రమాదేవి, సునీత తదితర సీనియర్ నాయకులు,వివిధ మోర్చ నాయకులు , శ్రీ గౌతమ్ స్కూల్ చైర్మన్ వై.వి సూర్య రావు , తదితరులు పాల్గొన్నారు.