తండ్రీ కొడుకులిద్దరూ సీమప్రజల భావోద్వేగాల్ని తమ స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారు

• రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి దొంగసాక్షిలో ప్రచురించింది అంతా అవాస్తవమే
• తప్పుడు మాటలు.. తప్పుడు పనులు.. తప్పుడు కథనాలతో జగన్ రెడ్డి ఎల్లకాలం ప్రజల్ని మోసగించలేడు
• చేయనివి చేసినట్టు చెప్పడం, జగన్ రెడ్డి ఏదో ఉద్ధరించినట్టు తప్పుడు రాతలు రాయడం, పదేపదే అవాస్తవాలతో ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయడం, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమేనా దొంగ సాక్షి పని?
• రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కింద నిర్మిస్తానన్న 23 ప్రాజెక్టుల నిర్మాణంపై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా?
• టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో సీమసాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు ఖర్చుపెడితే, జగన్ రెడ్డి కేవలం రూ.2011 కోట్లే వెచ్చించాడు
• సీమలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన హంద్రీనీవా నిర్మాణానికి చంద్రబాబు రూ.4,188 కోట్లు ఖర్చుచేస్తే, జగన్ రెడ్డి కేవలం రూ.515 కోట్లతో సరిపెట్టాడు : కాలవ శ్రీనివాసులు

• సీమ సాగునీటి ప్రాజెక్టులకు తన హాయాంలో రూ.12కోట్లు కూడా ఖర్చుచేయని అసమర్థుడు జగన్ రెడ్డి
• సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్, ప్రజలకు ఏం భరోసా ఇస్తాడు?
• ఎంతమందిని మార్చినా, ఎన్ని నియోజకవర్గాలు తిరగేసినా ప్రజల్లో తనపై ఉన్న అసహ్యం, ఈర్ష్యాద్వేషాలను జగన్ రెడ్డి చల్లార్చలేడు
• కడప ఎంపీగా షర్మిల, జగన్ సహా ఎవరు పోటీ చేసినా గెలిచేది టీడీపీనే
• జగన్ రెడ్డి, షర్మిల మధ్య విబేధాల్ని ఉమ్మడి కడప జిల్లా వాసులు నమ్మడం లేదు.
• ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే కేసీఆర్ ను పరామర్శించడానికి జగన్ రెడ్డి వెళ్తున్నాడు : రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి

జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయని, ప్రాధాన్యత రంగమైన సాగునీటి రంగం చతికిలబడిందని, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చూపుతున్న అంతులేని నిర్లక్ష్యం సీమ పాలిట పెనుశాపంగా పరిణమించిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే….!

“ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12వేల కోట్లుఖర్చు చేస్తే, జగన్ రెడ్డి ఇప్పటివరకు కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చుచేశాడు. ఇంత తక్కువ ఖర్చు పెట్టిన జగన్ రెడ్డి.. రాయలసీమ ద్రోహి కాక ఏమవుతాడో ప్రజలే ఆలోచించాలి.

టీడీపీ పాలనలో చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రాజెక్టులకు, ముఖ్యంగా అనంతపురం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనుల్ని పరుగులు పెట్టించారు. ఎక్కడిక కక్కడ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, కాంట్రాక్టర్లు…ఇంజనీర్లతో మాట్లాడి ఆగిపోయిన ప్రాజెక్టు పనుల్ని కూడా కొనసాగేలా చూశారు. టీడీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు కూడా అధికారులతో కలిసి స్వయంగా సాగునీటి ప్రాజెక్టుల పనుల్ని పర్యవేక్షించారు. ఆనాడు జరిగిన పనులతో పోలిస్తే, ఈ ప్రభుత్వంలో జరిగినవి శూన్యమనే చెప్పాలి.

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం.. వాటి నిర్వహణ తీరుతెన్నులపై జగన్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రులు అధికారులతో ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు?
అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు అధికారులతో సమీక్షలు చేశాడు? ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులపై చర్చలు జరిపాడు? ఇరిగేషన్ మంత్రిగా గతంలో ఉన్న అనిల్ కుమార్ గానీ, ఇప్పుడున్న మంత్రి అంబటి రాంబాబుగానీ ఎన్నిసార్లు అధికారులతో సమీక్షలు జరిపి, ఎన్నిసార్లు ఏ ప్రాజెక్టుల్ని సందర్శించారో ప్రజల కు చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ రాయలసీమలో భావోద్వేగా లు రెచ్చగొట్టి, తమపబ్బం గడుపుకున్నారుతప్ప సీమ ప్రజలకు చేసిందేమీ లేదు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడటంలో జగన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందాడు.

ఇచ్చిన హామీ ప్రకారం రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కింద చేపడతానన్న 23 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా?
రాయలసీమ శాశ్వత దుర్భిక్ష నివారణ పథకం కింద, రూ.33,868కోట్లతో 23 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడతానని జగన్ రెడ్డి హామీ ఇచ్చాడు. అది ఏమైందని ప్రశ్నిస్తున్నాం. తాను చెప్పిన 23 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎంతవరకు జరిగిందో, వాటిలో ఎన్ని పూర్తయ్యాయో, ప్రాజెక్టుల నిర్మా ణానికి తన ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో, ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చిందో పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నిస్తు న్నాం.

రాయలసీమ కరువుని నివారించే హంద్రీనీవా ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు రూ.4,188కోట్లు ఖర్చుపెడితే, జగన్ రెడ్డి మొక్కుబడిగా రూ.515 కోట్లు ఖర్చుపెట్టాడు
స్వర్గీయ నందమూరి తారకరామారావు తన హాయాంలో రాయలసీమ నుంచి కరువును శాశ్వతంగా పారదోలాలని గొప్ప ఆలోచన చేశారు. దానిలో భాగంగా హంద్రీనీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాలు రూపొందించారు. వాటి నిర్మాణ ప్రతిపాదనలు కూడా ఎన్టీఆర్ హాయాంలోనే సిద్ధమయ్యాయి. ఆ ప్రాజెక్టు లతో పాటు టీడీపీ ప్రభుత్వం సీమలోని ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా వేగ వంతం చేసింది. హంద్రీనీవా నిర్మాణానికి చంద్రబాబు నాయుడు రూ.4,188కోట్లు ఖర్చు పెట్టారు. అలాంటి ప్రాజెక్టు నిర్మాణానికి జగన్ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో పెట్టిన ఖర్చు కేవలం రూ.515కోట్లు. రాయలసీమకు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన హంద్రీనీవాను జగన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హంద్రీనీవా నీటి నిల్వ సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచు తానని, 6వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువని విస్తరిస్తానని, దానికి సమాం తరంగా 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మిస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయో జగన్ రెడ్డి సీమవాసులకు సమాధానం చెప్పాలి. 2020లో హంద్రీనీవా నిర్మాణానికి రూ.6,300కోట్లు ఖర్చుపెడుతున్నట్టు జగన్ రెడ్డి ఒక జీవో ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన టెండర్లే పిలవలేదు.

చంద్రబాబునాయుడి హాయాంలో జరిగిన పనులు తప్ప, 4 ఏళ్ల 8 నెలల్లో జగన్ రెడ్డి సీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఒక్కశాతం పని కూడా చేయించలేదు
టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు హంద్రీనీవా సామర్థ్యాన్ని 3,600 క్యూసెక్కుల సామర్థ్యానికి ప్రాజెక్టుని విస్తరించాలని, నిర్మాణ పనులకోసం రూ.1050 కోట్లు కేటాయించి, రూ.288కోట్లు ఖర్చుచేయడం జరిగింది. 35శాతం పైగా పనులు పూర్తయ్యాయి. టీడీపీప్రభుత్వంలో జరిగిన పనుల్ని జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే నిలిపేశాడు. మాయమాటలతో ఇప్పటివరకు సీమ వాసుల్ని మోసగిస్తూనే ఉన్నాడు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత, హక్కు జగన్ రెడ్డికి లేవు. సీమలో ఏ సాగునీటి ప్రాజెక్ట్ చూసినా జగన్ రెడ్డి హాయాంలో వెలవెలబోతూనే కనిపిస్తోంది.

గుండ్రేవుల, వేదవతి, అనంతపురంజిల్లాలో 50 వేల ఎకరాలకు బిందుసేద్యం కింద సాగునీరు అందించే ఉరవకొండ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కల్యాణదుర్గం, రూ.960కోట్లతో చేపట్టిన రాయదుర్గం నియోజకవర్గాలకు నీళ్లిచ్చే జీడిపల్లి- భైరవాని తిప్ప ప్రాజెక్ట్, రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన జీడి పల్లి-పేరూరు ప్రాజెక్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు, ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనులు తప్ప, జగన్ రెడ్డి హాయాంలో ఎక్కడా ఒక్క ప్రాజెక్టు లో ఒక్క శాతం పనికూడా జరగలేదు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయకుండా, రైతులకు నీళ్లివ్వకుండా సీమకు ఎలా న్యాయం జరుగుతుందో ముఖ్యమంత్రి చెప్పాలి.

సీమ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి దొంగ సాక్షిలో ప్రచురితమైనదంతా పూర్తిగా అవాస్తవం
రాయలసీమ ప్రాజెక్టుల గురించి సాక్షి దినపత్రికలో ప్రచురితమైన సమాచారమం తా పూర్తిగా అవాస్తవం. చేతిలో ఉన్న దొంగసాక్షి పత్రికలో తప్పడు రాతలు, తప్పుడు వివరణ లు ఇచ్చినంత మాత్రాన సీమరైతులకు నీళ్లు అందవనే వాస్తవాన్ని జగన్ రెడ్డి గ్రహించాలి. తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఈ 4 ఏళ్ల 8 నెలల్లో సీమలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి, ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. చేతిలో అవినీతి పత్రిక ఉందని కోట్లరూపాయల ప్రజలసొమ్ముతో అబద్ధపు ప్రకటనలివ్వడానికేనా ప్రజలు జగన్ రెడ్డికి అధికారమిచ్చింది? ప్రభుత్వం చేయకపోయినా చేసినట్టు చెప్పడం, జగన్ రెడ్డి ఏదో ఉద్ధరించినట్టు తప్పుడు రాతలు రాయడం, పదేపదే కట్టుకథలతో ప్రజల్ని మోసగించాలని చూడటం, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమేనా దొంగ సాక్షి పని?

నంద్యాలలో దశరథరామిరెడ్డిన జగన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయించాడో చెప్పాలి. అతనేమీ తెలుగుదేశం పార్టీ మనిషి కూడా కాదు. రాయలసీమ సాగునీ టిప్రాజెక్టులపై మాట్లాడుతున్నాడనే జగన్ రెడ్డి అతన్ని అన్యాయంగా తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేయించి జైలుకు పంపాడు. రాయలసీమ ఉద్యమకారులు, మేథావులపై జగన్ రెడ్డికి కక్ష ఉంది కాబట్టే, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. ఇలాంటి తప్పుడుపనులు, తప్పుడు కథనాలతో ఎంతకాలం ప్రజల్ని మోసగిస్తావు జగన్ రెడ్డి? నిన్ను, నీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టడానికి సీమ వాసులు సిద్ధంగా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీ కట్టబెట్టి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి, రాయలసీమ భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవ డానికి, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసుకోవడానికి వేయికళ్లతో ఎదురు చూస్తు న్నారు. అరెస్టులు..బెదిరింపులు..భయోత్పాతాలు…అణచివేతల ద్వారా సీమ ఉద్యమాన్ని, సీమవాసుల పోరాటాన్ని జగన్ రెడ్డి అణచివేయలేడు. సొంత ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడు.” అని కాలవ శ్రీనివాసులు తేల్చిచెప్పారు.

రాయలసీమకే కాదు…సొంత జిల్లాకు, పులివెందుల నియోజకవర్గానికి కూడా జగన్ రెడ్డి చేసిందేమీ లేదు, సొంత చెల్లికి న్యాయం చేయని వాడు ప్రజలకు ఏం చేస్తాడు? : రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి
“జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు మాత్రమే ద్రోహం చేయలేదు. సొంత నియోజకవర్గమైన పులివెందులకు కూడా తీరని అన్యాయం చేశాడు. 2019లో అధికారంలోకి వచ్చాక కడపజిల్లాకు రావడం.. మొక్కుబడిగా పునాది రాళ్లు వేయడం తప్ప జగన్ రెడ్డి ఇప్పటివరకు సాధించిందేమీ లేదు. ఏటా క్రిస్మస్ నాడు, తన తండ్రి వర్థంతి నాడు కడపజిల్లాకు రావడం తప్ప, సొంత జిల్లా వాసు లకు ముఖ్యమంత్రి ఇసుమంతైనా సాయం చేయలేదు. మొన్న క్రిస్మస్ పండుగకి కడపజిల్లాకు వచ్చిన జగన్ రెడ్డి, జిల్లాలో నీటిపారుదల వ్యవస్థ ఆధునికీకరణకు రూ.12,500 కోట్ల నిధులు కేటాయిస్తూ జీవోలు ఇచ్చాడు.

గండికోట నుంచి చిత్రావతికి, గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్ కు రూ.4,600 కోట్లు కేటాయించిన జగన్ రెడ్డి కనీసం రూ.4 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు లిఫ్ట్ నిర్మాణం కోసం కొత్తప్రతిపాదనలు పెట్టాడు. అలానే మైదుకూరు వద్ద ఉన్న కుందూ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తెలుగుగంగకు నీటి పారుదల కోసం ప్రతిపాదనలు పెట్టాడు. ఆయా ప్రతిపాదనలకోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా పురోగతి ఎలా వస్తుందో జగన్ రెడ్డి చెప్పాలి.

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు జగన్ రెడ్డి రూ.12కోట్లు కూడా ఖర్చుచేయలేదు
టీడీపీప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గండికోట రిజర్వాయర్లో నీళ్లు నింపితే, ఆ నీటిని తన సొంతజిల్లాకు తరలించలేకపోయిన దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. సీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.12,500కోట్లు కేటాయించి న జగన్ రెడ్డి.. తనపాలనలో ఇప్పటివరకు రూ.12కోట్లు కూడా ఖర్చు చేయలే దు. వేలకోట్ల ప్రజలసొమ్ము వెచ్చించి జగన్ రెడ్డి వేస్తున్న పునాదిరాళ్లు సమాధి రాళ్లుగా మిగులుతున్నాయి తప్ప ఎలాంటి ఉపయోగం లేదు.

సొంత జిల్లాలో కూడా పరదాల మాటున దాక్కొని తిరిగిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక్కడే సొంతచెల్లిని తరిమేసిన వ్యక్తి ప్రజలకు ఏం భరోసా ఇస్తాడు?
జగన్ రెడ్డి కడపకు వచ్చిన ఒక్కరోజు ప్రజలకు నరకం చూపించాడు. పరదాల చాటున సొంత జిల్లాలో తిరిగిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి నిలిచిపోతాడు. ఈ ప్రభుత్వంలో ఏ వ్యవస్థా సక్రమంగా లేదు… ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. సొంత చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు తనపార్టీ వారికి ఏం భరోసా ఇస్తాడు? ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబునాయుడి నాయకత్వంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు సునామీ సృష్టించబోతున్నాయి. జగన్ రెడ్డి ఎన్ని ప్రయోగాలుచేసినా, ఎవర్ని ఎక్కడికి మార్చినా ఉపయోగం ఉండదు. జగన్ రెడ్డిపై, ఆయన ప్రభుత్వంపైనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. చెప్పలేనంత అసహనం..ఆవేశం..ఆక్రోశం ప్రజల్లో ఉన్నాయి.

అధికారుల్ని మార్చి నట్టు సొంతపార్టీ వారిని జగన్ రెడ్డి నియోజకవర్గాలు మార్చినంత మాత్రాన ఆయనకు ఒరిగేదేమీ లేదు. జగన్ దుర్మార్గపు పాలనపై రాష్ట్రప్రజలతో పాటు, ముఖ్యంగా కడపజిల్లా ప్రజలు ఆలోచించాలి. ఇన్నేళ్లలో జగన్ రెడ్డి కడపజిల్లాలో ఎక్కడా ఒక్క రోడ్డు వేసింది లేదు. ప్రజలకు తాగునీరు కూడా అందించలేక పోయాడు. ఉమ్మడి కడపజిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడు తెలుగుదేశానికి ఓటు వేద్దామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎవరుపోటీచేసినా కడప ఎంపీ స్థానం కూడా టీడీపీనే గెలుస్తుంది. జగన్ రెడ్డి, షర్మిల మధ్య ఉన్న విబేధా ల్ని ఉమ్మడి కడప జిల్లా వాసులు నమ్మడం లేదు. ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఓడిపోయిన కేసీఆర్ ను పరామర్శించడానికి జగన్ రెడ్డి వెళ్తున్నాడు. ఒకగూటి పక్షులు ఒకచోటకు చేరడానికి సిద్ధమవుతున్నాయి.” అని రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవాచేశారు.

Leave a Reply