భార్య కళ్ళ ఎదుట భర్త పాశవిక హత్య

నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో ప్రసాద్‌ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కిన కొందరు గుర్తుతెలియని యువకులు.. ఆమె ఎదుటే భర్తను చిత్రహింసలకు గురిచేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. శరీరంపై 25కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply