టీడీపీలో చేరిన బైరెడ్డి శబరి

హైదరాబాద్: కర్నూలు జిల్లా సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన నివాసంలో ఆమెకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలసికట్టుగా పనిచేసి, రేపటి ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో, టీడీపీ-జనసేన-బీజేపీ మిత్రపక్షాల అభ్యర్ధుల విజయానికి సహకరించాలని సూచించారు. కేంద్రమాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు బీదా రవిచంద్రయాదవ్, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply