Suryaa.co.in

Andhra Pradesh

గీతం వర్సిటీకి లబ్ది చేకూర్చేందుకే ఆంధ్రా యూనివర్సిటీపై దుష్ప్రచారం

– చంద్రబాబు ఒక మ్యానిపులేటర్
– రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ
– ట్విట్టర్ వేదికగా ఎంపి విజయసాయిరెడ్డి

విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి లబ్ది చేకూర్చడానికే నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ ఆంధ్రా యూనివర్సిటీపై దుష్ప్రచారం చేస్తున్నరని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

సోమవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై ఆయన స్పందించారు. గీతం వర్సిటి వ్యవస్థాపకుడు ఆంధ్రా యూనివర్సిటీని దెయ్యాలకొంప అన్నది మర్చిపోయార అని టిడిపి నాయకులను ఆయన ప్రశ్నించారు.ఈ గీతం యూనివర్సిటీ టిడిపి నేత లోకేష్ సమీపబందువుదే. నాని,అతని వారసుల కోసమే ప్రజా యూనివర్సిటీని నాశనం చేయాలనుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏయూ భూములపై కన్నేసిన వీరి ఆటలు సాగవని ఆయన హెచ్చరించారు.

టిడిపి అధినేత చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వ్యవస్థల్ని మేనేజ్ చేసి బయటపడతాడని అన్నారు. వంగవీటి రంగా హత్య నుంచి ఇదే తీరు,హత్యలు చేయిస్తాడు,మళ్ళీ వారి కుటుంబంతోనే బేరసారాలు జరుపుతాడని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు నైజం ఇదేనాని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సమస్య వస్తే దానిని ఢీ కొని పరిష్కరించే సత్త ఉన్నవారని చెప్పారు. ఒక మ్యానిపులేటరుకి – నిజమైన నాయకునికి తేడా ఇదేనాని ఆయన అన్నారు.

వ్యవసాయం దండగని ‘మనసులోమాట’గా చెప్పిన చంద్రబాబుకి ఇప్పుడు రైతులపై అంతులేనిప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు.ఉమ్మడి రాష్ట్ర సిఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు బషీర్ బాగ్ లో రైతులను పిట్టల్లా కాల్చిచంపించిన చరిత్ర ఎవరిదని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఉచితవిద్యుత్తు ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాల్సిందేపని ఆనాడు డా.వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎగతాళి చేసిన సంగతి మరిచారా గజినీ.. అంటూ చంద్రబాబుని సూటిగా అడిగారు.

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకనుగుణంగా తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తున్నారని ఆయన చెప్పారు. వెల్లువలా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మహిళలు దేశంలో ఎక్కడాలేని విధంగా తమ కాళ్ల మీద తామే ధైర్యంగా నిలబడగల్గుతున్నారని వెల్లడించారు.

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారని అన్నారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు.. తగినంత వైద్య సిబ్బంది, అన్ని రకాల ఔషధాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని కొనియాడారు.రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతం అయిందని, ఏ మారుమూల గ్రామంలోకి వెళ్లి ఏ పీహెచ్‌సీని చూసినా ఇట్టే తెలుస్తోందని ఆయన చెప్పారు.

LEAVE A RESPONSE