కృష్ణయ్య ఏంటయ్యా నీ లీలలు

కేవలం వెన్నదొంగే అనుకున్నాం గానీ.. మా అందరి హృదయాలు దొంగలిస్తావని అనుకోలేదు.. కురుక్షత్రంలో పాండవులను గెలిపిస్తున్నావు అనుకున్నాం గానీ… లోకధర్మాన్ని నిలబెడుతున్నావని అనుకోలేదు.. గోపికలతో సరసాలాడుతున్నావని అనుకున్నాంగానీ.. వారి పాలిట రక్షకుడవుగా నిలుచున్నావని అనుకోలేదు.. అన్నిటినీ అనుభవిస్తున్న భోగలాలసుడవు అనుకున్నాంగానీ.. సమస్తాన్ని సమదృష్టితో చూడగల ద్రష్టుడవు అనుకోలేదు.. దేవకీ కుమారునిగా…. కుచేలుని నేస్తానివిగా… సాందీపుని శిష్యునిగా… అర్జుని రథసారధిగా…. పోషించిన ప్రతి పాత్ర.. సర్వమానవాళికి జీవిత పాఠం.. ఆనందానికి అసలు చిరునామా.. అంతర ప్రయాణానికి నీవే మా…

Read More

తిరుమలలో తిరుప్పోనకం అంటే?

దీనికి పెద్ద చరిత్రే …! తిరుప్పోనకమా…!! మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఉంటే ఎప్పుడో ఒకప్పుడు తిరుప్పోనకం తినే ఉంటారు. తిరుప్పోనకం అంటే ఏదో కాదండీ. నెయ్యితో చేసిన పొంగళి ప్రసాదమే.. ఈ నేతిపొంగలికి చాలా చరిత్రే ఉంది. శాసనాల్లో లభించిన సమాచారం ప్రకారం.. అసలు తిరుమల ఆలయంలో స్వామికి నివేదిస్తున్న నేతి పొంగలి ఈనాటిది కాదు. వందల యేళ్ల క్రితం నుంచే స్వామివారికి నేతి పొంగలిని నైవేధ్యంగా పెడుతున్నారు.విజయనగర రాజుల కాలం నుంచి శ్రీవారి ఆలాయంలో…

Read More

అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉన్కేశ్వర్‌ శివాలయం

రోగాలను నయం చేసే శివుడు రామచంద్రుడు ప్రతిష్ఠించిన ఆ లింగాన్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాలనూ దర్శించుకున్నంత పుణ్యమట. అంతేకాదు ఈ శివుడ్ని ప్రత్యేకంగా రోగనాశకుడిగా చెబుతారు. అక్కడి వేడినీళ్ల కుంటలో స్నానమాచరిస్తే శరీరం ఆరోగ్యవంతమవుతుందట. ఆ సుప్రసిద్ధ క్షేత్రమే మహారాష్ట్రలోని ఉన్కేశ్వర్‌! రామచంద్రమూర్తి వనవాస కాలంలో అనేకానేక అడవుల్లో పర్యటించాడంటారు. అందులో భాగంగానే ఉన్కేశ్వర్‌ సమీపంలో సీతాలక్ష్మణ సమేతంగా నివాసమున్నాడట. ఆ సమయంలోనే ఓ భక్తుడి వ్యాధుల్ని నయం చేసేందుకు ఆయనే ఈ క్షేత్రాన్ని సృష్టించాడట. భక్తుడి…

Read More

శ్రీ కృష్ణుడితో యుద్ధం తరువాత .. జాంబవంతుడు ఏమయ్యాడు?

ఇటువంటి చాలా ప్రశ్నలకు రామాయణంలో గానీ భారతంలో గానీ భాగవతంలో గానీ నేరుగా సమాధానం ఎవరూ చెప్పలేదు. కానీ మనం ఊహించ వచ్చు. మొట్ట మొదటిగా జాంబవంతుడు చిరంజీవి కాదు. దీర్ఘాయుర్ధాయం ఉన్న వాడు మాత్రమే. ఇతను సృష్టి మొదట్లోనే బ్రహ్మ ముక్కు రంధ్రం లో నుండి పుట్టినట్లు గా చెప్పబడింది. వామనావతారం లో వామనుడు త్రివిక్రముడు గా మారి అన్ని లోకాలు ఆక్రమించినప్పుడు జాంబవంతుడు 21 మార్లు ఆయనకు ప్రదక్షిణం చేసాడట. అంత శక్తిమంతుడు. రామాయణంలో…

Read More

మాతా అన్నపూర్ణేశ్వరీ

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం పేర్కొంటోంది. జ్ఞానాన్వేషకులైన మునులు అన్నాన్ని అలక్ష్యం చేయరు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మకాగా, ఆ మంటని చల్లార్చేది కూడ ఆ చల్లని తల్లే. ఆ తల్లి కాశీనగరంలో కాశీ అన్నపూర్ణేశ్వరిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తోంది. ఆ అన్నపూర్ణమ్మ తల్లి కాశీలో కొలువై ఉండటం వెనుక ఒక కథ ఉంది. బ్రహ్మదేవుని గర్వమణిచేందుకై పరమశివుడు, బ్రహ్మ తలల్లో…

Read More

“తలనీలాలు” అంటే ఏమిటి?

శ్రీవారికి తలనీలాలు సమర్పించడం కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం “తలనీలాలు” అంటే ఏమిటి ..? నీలాలు అంటే కురులు.. తలనీలాలు అంటే….తల పైన ఉండే కురులు అని అర్థం… తలనీలాలు సమర్పించడంలో శాస్త్రం మగవాళ్ళకి ” సంపూర్ణ శిరోముండణం” మరియు ఆడవాళ్ళకి కేవలం కొన్ని కురులను సమర్పించడం మాత్రమే అని స్పష్టంగా తలనీలాలుగా వర్ణిస్తుంది అయితే ఆడవాళ్లు ప్రత్యేకించి ఎంత మొత్తంలో తలనీలాలు సమర్పించాలి అనేది ఒక ఖచ్చితమైన…

Read More

దేవాలయాలకు వెళ్లాలా?

దైవారాధనకు చాలా పద్ధతులున్నాయి. మానసిక పరిపక్వత కల్గినవారు ఏకాంతంగా ఒక గదిలో కూర్చొని మానసికమైన ధ్యానం చేసుకోగలరు. మనస్సును నియంత్రణ చేయలేనివారు దేవాలయంలో వలెనే తమ ఇండ్లలో విగ్రహాలు పెట్టుకొని మంత్ర పఠనంతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. తమ ఇండ్లలో ఈ కార్యక్రమం నిర్వహించటానికి అవకాశం లేనివారు ఆలయాలకు వెళ్లి అక్కడ ఈ విధులను నిర్వర్తించి భగవదనుగ్రహాన్ని పొందుతారు. మానవుని దుఃఖాల్ని ఉపశమింప చేయగల దివ్యౌషధం పరమాత్ముని యందు మనంలగ్నం చేసే స్థిరమైన భక్తి విశ్వాసాలే. మన…

Read More

విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది?

భీష్మ పితామహుడు పాండవులకు బోధిస్తున్నటువంటి సన్నివేశం ఇది. భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం? అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న…

Read More

మృదంగ శైలేశ్వరి దేవి

కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్ళీ వదిలి వెళ్ళటం ఇలా 3సార్లు జరిగింది. “మృదంగ శైలేశ్వరి ఆలయం” అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. కేరళ శాస్త్రీయ నృత్యం “కథాకళి” ఇక్కడే ఉద్భవించింది. దీనిని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా…

Read More

అధికమాసం – శూన్యమాసం – అయోమయం!

అధికమాసంలో నిర్ణయాలు, ప్రకటనలు ధర్మబద్ధం! అధికమాసానికి తనదైన విశిష్టత ఉంది. ఇది శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన నెల. అందుకే దీనికి ‘పురుషోత్తమ మాసం’ అనే పేరును ఆయన ప్రసాదించాడనీ, ఈ మాసంలో చేపట్టే దైవకార్యాలకు అధికమైన ఫలాలు లభిస్తాయని వరమిచ్చాడనీ పురాణాలు చెబుతున్నాయి. అధికమాస మహిమ గురించి మహా విష్ణువును లక్ష్మీదేవి అడిగినప్పుడు. “పురుషోత్తమ మాసంలో ఎవరైతే పుణ్య నదీస్నానాలు, జప, హోమాలు, దాన ధర్మాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు…

Read More