Suryaa.co.in

Andhra Pradesh

వైకాపా కౌన్సిలర్‌ ఇంట్లో సీబీఐ సోదాలు

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో 21వ వార్డుకు చెందిన వైకాపా కౌన్సిలర్‌ మారుతీరెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.సోషల్‌ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు నేపథ్యంలో సీబీఐ బెంగళూరు శాఖకు చెందిన డీఎస్పీ ప్రదీప్‌ కుల్‌దీప్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. మొత్తం ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరెడ్డిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

LEAVE A RESPONSE