ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ నేతలు

ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు. నేడు పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్రకార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ….ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు.

పొట్టి శ్రీరాములు 54 రోజులు దీక్ష ఫలితంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి అన్నారు. అమరజీవి ఘనకీర్తిని రాబోయే తరాలకు అందించేందుకు అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మం చౌదరి, టీడీపీ నేత ఏ.ఏ రావ్ , బీసీ నేత దత్తు యాదవ్, టీడీపీ కార్యాలయ ఆహ్వాన కమిటీ సభ్యుడు హసన్ బాషా సహా పలువురు నేతలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply